Rowdysheeter attack : ఇంటిపన్ను కట్టమన్నందుకు అధికారులపై రౌడీషీటర్ దాడి
గుంటూరు జిల్లా మంగళగిరిలో రౌడీ షీటర్ హల్‌చల్ చేశాడు. ఇంటిపన్ను కట్టమన్నందుకు ఏకంగా మున్సిపల్ అధికారులపై దాడి చేశాడు.

Rowdysheeter Attack
Rowdysheeter attacks municipal officials : గుంటూరు జిల్లా మంగళగిరిలో రౌడీ షీటర్ హల్‌చల్ చేశాడు. ఇంటిపన్ను కట్టమన్నందుకు ఏకంగా మున్సిపల్ అధికారులపై దాడి చేశాడు. పొట్లబత్తుని శివ అనే రౌడీషీటర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. నన్నే ట్యాక్స్ కట్టమంటారా.. అంటూ అధికారులను వీధుల్లో పరిగెత్తించారు. స్థానికులు అడ్డుపడటంతో గొడవ సద్దుమణిగింది.
మున్సిపల్ సిబ్బంది వెళ్లి ట్యాక్స్ చెల్లించమన్నందుకు దాడి చేశాడు. గతంలో శివ కౌన్సిలర్ గా పని చేశారు. ఇంటి పన్ను బకాయిలు ఉన్న క్రమంలో మున్సిపల్ అధికారులు అతనికి ఇంటికి వెళ్లి డబ్బులు కట్టమన్నందుకు శివ, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులపై శివ దాడికి చేశాడు. దీంతో మున్సిపల్ అధికారులు పరుగెత్తారు.