Sai Baba Abhishekam : సాయిబాబాకు అభిషేకంలో మద్యం సీసాలు.. తిట్టిపోస్తున్న జనాలు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరంలో సాయిబాబాకు చేసే అభిషేకంలో అపచారం చోటుచేసుకుంది.

sai baba abhishekam

Sai baba abhishekam In AP : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం (Achanta Vemavaram)లో సాయిబాబాకు చేసే అభిషేకంలో అపచారం చోటుచేసుకుంది. బాబాకు కొంతమంది భక్తులు అభిషేకం చేశారు. తేనెతో అభిషేకం చేశారు. ఈ అభిషేకంలో అపచారం జరిగింది. వేమవరంలో సాయిబాబా దేవాలయాన్ని పున:నిర్మించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గురు పౌర్ణమి (Guru Purnima) సందర్భంగా బాబా విగ్రహానికి భక్తులు తేనెతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అపచారం చోటుచేసుకుంది.

సాధారణంగా అభిషేకాలు నిర్వహించే సమయంలో పంచపాత్రతో ద్రవ్యాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. కానీ బాబాకు అభిషేకం చేసే తేనెను మద్యం సీసాలతో నింపి ఆ తేనెతో అభిషేకం చేశారు కొంతమంది భక్తులు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచామృత పాత్రలతో అభిషేకం చేయాలి గానీ ఇలా మద్యం సీసాలతో తీసుకురావటం సరికాదని, ఇది అపచారం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేనెతో అభిషేకం చేయటంలో ఎటువంటి ఇబ్బంది లేదు గానీ.. ఆ తేనెను మద్యం సీసాల్లో నింపి తీసుకొచ్చి బాబాకు అభిషేకం చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: అమర్‌నాథ్‌ యాత్ర వెనుక చరిత్ర ఏంటి.. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం విశేషాలు తెలుసుకోండి