Sai Priya Missing Case: ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది..! సాయి ప్రియ కేసులో కొత్త ట్విస్ట్..
సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. భర్త కళ్లుగప్పి బీచ్ నుంచి తప్పించుకుపోయిన సాయిప్రియ మరో ట్విస్ట్ ఇచ్చింది.. బెంగళూరులో ప్రియుడు రవిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.

Sai Priya
Sai Priya Missing Case: విశాఖపట్టణం ఆర్కే బీచ్ లో తప్పిపోయిన వివాహిత సాయిప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. తాజాగా సాయి ప్రియ మరో ట్విస్ట్ ఇచ్చింది. బెంగళూరుకు ప్రియుడితో పరారైన ఆమె.. ప్రియుడు రవిని రెండో పెళ్లి చేసుకున్నట్లు వారికి తల్లిదండ్రులకు తెలిపింది. కొత్త తాళిబొట్టు ఉన్న ఫొటోను తల్లిదండ్రులకు సాయి ప్రియ పంపించింది.
Sai Priya Missing Mystery : వైజాగ్ బీచ్‌లో మిస్సింగ్ మిస్టరీ.. అసలేం జరిగింది? సాయిప్రియ ఎక్కడ?
వైజాగ్ ఆర్కే బీచ్‌లో రెండు రోజుల క్రితం సాయిప్రియ అదృశ్యమైనట్లు భర్త శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీచ్ లో అలలకు సముద్రంలో గల్లంతైనట్లు భావించిన అధికారులు.. వివాహిత ఆచూకీకోసం రెస్క్యూ టీంతో సముద్రంలో గాలింపు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవటంతో నావీ సాయం కోరారు. దీంతో రెండు కోస్ట్ గార్డ్ షిప్ లతో పాటు ఓ హెలికాప్టర్ తో సైతం బీచ్ ప్రాంతంలోని సముద్రంలో గాలించారు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. సాయిప్రియ సముద్రంలో గల్లంతు కాలేదని, ప్రియుడితో కలిసి నెల్లూరుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.. సాయిప్రియ ఆడిన డ్రామాతో అందరూ విస్తుపోయారు.
SaiPriya Missing Mystery : వీడిన సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీ..పెళ్లిరోజునే భర్తకు హ్యాండిచ్చి..
సాయిప్రియ ఆఖరి ఫోన్‌కాల్‌ను పోలీసులు కావలిలో ట్రేస్ చేశారు. ప్రియుడితో కలిసి సాయిప్రియ రైల్లో నెల్లూరు జిల్లాకు పరారైనట్లు తేలింది. తాజాగా సాయిప్రియ మరో ట్విస్ట్ ఇచ్చింది. ప్రియుడు రవితో కలిసి బెంగళూరులో పెళ్లిచేసుకున్నట్లు తల్లిందండ్రులకు తెలిపింది. కొత్త తాళిబొట్టు ఉన్న ఫొటోను తల్లిదండ్రులకు పంపించింది. సాయిప్రియకు, శ్రీనివాస్‌కు 2020 జూలై 25న పెళ్లైంది. అయితే నెల్లూరుకు చెందిన ప్రియుడు రవితో సాయిప్రియ పెళ్లికి ముందు నుంచే ప్రేమలో ఉన్నట్లు తెలిసింది.