ప్రతి ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు ఇలా చేస్తారు: సజ్జల

చంద్రబాబు కలలుగన్న కూటమి వికటించిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

sajjala ramakrishna reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తీరు పరకాష్ఠకు చేరిందంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతిలో సజ్జల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల సమయంలోనూ చంద్రబాబుకు పునకాలు వస్తాయని అన్నారు. సైకిల్ రావాలి, సైకో పోవాలి అన్న పాటకు చంద్రబాబు నాయుడు నృత్యం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు కలలుగన్న కూటమి వికటించిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పవన్ కల్యాణ్‌కు ఉనికి లేకుండా పోయిందని అన్నారు. బీజేపీలో కూడా బాబు అనుకున్నట్టే సీట్లు ఖరారయ్యాయని తెలిపారు. 2019 ఎన్నికల కంటే ఘోరంగా టీడీపీ ఓడిపోతుందని చెప్పారు.

వ్యవస్థల మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన తీరు ఎలా ఉందో అందరికీ తెలుసని చెప్పారు. జగన్ మాత్రం ఏ రోజూ వ్యవస్థల మీద మాట్లాడలేదని అన్నారు. పెన్షన్లకు డబ్బులు లేవని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు.

రాష్ట్రంలో అధికారులు స్వతంత్రంగా పని చేస్తున్నారని అన్నారు. కూటమి బీసీ, ఎస్సీ, మైనార్టీ అధికారుల మీద ఈసీకి కూటమి ఫిర్యాదు చేస్తోందని ఆయన విమర్శించారు. అంటే వారి ఉద్దేశం ఎంటని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Also Read: పవన్ కల్యాణ్ పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు