జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు.. మీరు సమాధానం చెప్తే అప్పుడు నేను సమాధానం చెప్తా అంటూ ముద్రగడ పద్మనాభం అన్నారు.

Mudragada Padmanabham
Mudragada Padmanabham : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సోదరులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునిల్ కుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ క్లబ్ లు నడిపే వారితో నన్ను తిట్టిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు? మీరు సమాధానం చెప్తే అప్పుడు నేను సమాధానం చెప్తా అంటూ ముద్రగడ అన్నారు. తెరవెనుక ఉండి మాట్లాడించడం మగతనం కాదు.. దమ్ము ధైర్యం ఉంటే నేరుగా నా గురించి ప్రశ్నించండి. క్లబ్బులు నడిపే వారితో 5, 10 రూపాయలు ఎంవోలు చేసి అవమానించారు. రోజుకో లక్ష చొప్పున నాకు ఎంవోలు చేయండి.. ప్రజా సేవకోసం ఉపయోగిస్తానని ముద్రగడ అన్నారు.
పవన్ కల్యాణ్ కూటమి పొత్తులో భాగంగా తీసుకున్న 20 సీట్లు కూడా త్యాగం చేసి పార్టీ మూసేయడం మంచిది. షూటింగ్ లకు వెళ్లిపోతే త్యాగశీలిగా మిగిలిపోతారు పవన్ అంటూ ముద్రగడ సలహాలు ఇచ్చారు. పవన్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వరు, బౌన్సర్లతో అడ్డుకుంటారు. మరెందుకు మీకు ప్రజాసేవ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఎస్టేట్ ను కాపాడేందుకే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్దిచెప్పి ప్యాక్ చేసి పవన్ పార్టీని ఇంటికి పంపేయాలని ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు.
Also Read : Tanuku Assembly Constituency : కారుమూరి వర్సెస్ రాధాకృష్ణ.. ఈసారి తణుకు తీర్పు ఎలా ఉండబోతోంది?