Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు బరితెగింపు తనానికి ఉదాహరణ అదే..! వారంతా ఏకమై దాడి మొదలు పెట్టారు

ఓట్ల కోసం వైసీపీ ప్రభుత్వం డబ్బులు పంచడం లేదు. పేదల సంక్షేమం‌కోసం వివిధ పథకాల కింద నగదు జమ చేస్తున్నాం. కులం, పార్టీల‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం..

Sajjala Ramakrishna Reddy: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్రమాలకు చిరునామాగా చంద్రబాబు ఉన్న అక్రమ నివాసం కనిపిస్తుందని అన్నారు. సీఎం జగన్ దేశానికే తలమానికంగా ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారని, ఇది ఓర్వలేని ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా తోడేళ్లు మందలా ఎటాక్ చేయాలని చూస్తున్నాయని సజ్జల అన్నారు.

Yuva Galam Padayatra: లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న నారా భువనేశ్వరి.. భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు.. ఆసక్తికర ట్వీట్ చేసిన యువనేత

ఓట్ల కోసం కాదు.. సంక్షేమం కోసం ..

ఓట్ల కోసం వైసీపీ ప్రభుత్వం డబ్బులు పంచడం లేదు. పేదల సంక్షేమం కోసం వివిధ పథకాల కింద నగదు జమ చేస్తున్నాం. కులం, వెనుకబాటు తనం, పార్టీల‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. పేదరికం నుంచి సొంతకాళ్లపై నిలబడేలా సంక్షేమం అమలు చేస్తున్నాం. సీఎం జగన్ దేశానికే తలమానికంగా ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా తోడేళ్ళు మందలా ఎటాక్ చేయాలని చూస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏమరుపాటుగా ఉంటే వారు చెప్పేదే వాస్తవం అనిపించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు కేవలం దుష్ప్రచారం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి మొత్తం వేరేగా ఉంది. 80శాతం కుటుంబాలు జగన్‌తో ఉన్నామని చెబుతున్నా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల యుద్ధం ఎలా జరిగినా అప్రమత్తంగా ఉండాలంటూ వైసీపీ శ్రేణులకు సజ్జల సూచించారు.

Karnataka Election Result: కాంగ్రెస్ విజయంలో మా కృషి కూడా ఉంది.. డిప్యూటీ సీఎం, ఐదు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే..

చంద్రబాబు బరితెగింపు తనానికి ఉదాహరణ ..

చంద్రబాబు బరితెగింపు తనానికి ఉదాహరణ ఆయన ఉంటున్న నివాసం అని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పేదలకు ల్యాండ్ ఇవ్వకుండా కోట్ల రూపాయల విలువైన భూమి దోచేయాలని చూశారని అన్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లతో కలిసి పేదలకు స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్షాలపై సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో దేశంలో జరిగిన అతిపెద్ద స్కాం అమరావతి. అక్రమాలకు చిరునామా‌గా చంద్రబాబు ఉన్న అక్రమ నివాసం కనిపిస్తుంది. లింగమనేని రమేష్‌కు ఒక్క రూపాయి రెంట్ పే చేయలేదు. ఏ హోదా‌తో అక్కడ ఉన్నారో తెలియదు. దేశభక్తితో నా హౌస్ ప్రభుత్వానికి ఇచ్చానని లింగమనేని కోర్టులో చెప్పారు. చంద్రబాబు సీఎం పదవి పూర్తయ్యాక ఎందుకు ఖాళీ చేయలేదని సజ్జల ప్రశ్నించారు. గెస్ట్ హౌస్ కోసం లింగమనేని రమేష్‌కు రైతుల భూమి ఇచ్చారని స్జజల విమర్శలు చేశారు.

Ketika Sharma : సమ్మర్‌లో హాట్ ఫోజులతో మరింత హీట్ పెంచుతున్న కేతిక శర్మ..

అందరూ ఒక్కటయ్యారు..

కరుడు గట్టిన దుర్మార్గులు, పెత్తందార్ల పక్షాన టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు ఒక్కటయ్యారు. కుట్రపూరితంగా జగన్ పై దాడి మొదలు పెట్టారు అంటూ సజ్జల ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిజాయితీకి, అబద్ధానికి మధ్య వార్ జరుగుతుంది. నిజాయితీ వైపు వైసీపీ ఉంటే అబద్ధం వైపు అందరూ ఒక్కటయ్యారు. జగన్ చేస్తున్న రాజకీయం చంద్రబాబు‌కు ఉరితాడు లాంటిది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వైసీపీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సజ్జల పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు