వైసీపీలో అసంతృప్తులు.. కీలక వ్యాఖ్యలు చేసిన సజ్జల
అసంతృప్తులు ఉంటే మాట్లాడతాం. సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. అసంతృప్తుల గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన పనిలేదు.

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy : వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో నో టికెట్ అని సీఎం జగన్ ఇప్పటికే చెప్పేశారు. పలువురు ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో వైసీపీలో అసంతృప్తులు మొదలయ్యాయి. పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సైతం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈసారి జగ్గంపేట టికెట్ ఇచ్చేది లేదని జగన్ చెప్పడంతో చంటిబాబు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
Also Read : ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్ షాక్..! పీకేను దూరం చేసిన నారా లోకేశ్
ఇలా వైసీపీలో అలజడి రేగింది. అసంతృప్తుల అంశంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏ పార్టీలోనైనా అసంతృప్తులు సహజమే అని అన్నారాయన. ఇలాంటివి లేకపోతే అది ఎత్తిపోయిన, చెల్లని పార్టీ కిందే లెక్క అని సజ్జల కామెంట్ చేశారు. ”మా పార్టీ మంచి ఫామ్ లో ఉంది. కాబట్టే పోటీ చేయటానికి నాయకులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఇది చాలా సహజంగా జరిగే వ్యవహారం. అసంతృప్తులు ఉంటే మాట్లాడతాం. సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. అసంతృప్తుల గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన పనిలేదు” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా? జగన్ సోదరి వ్యూహం ఏంటి?
జగన్‌దే ఫైనల్ డెసిషన్- హోంమంత్రి వనిత
సీఎం జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని, అలా కాకుండా.. మీ సేవలు ఇక చాలు అంటే హ్యాపీగా పార్టీ కోసం పని చేస్తానని అన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. అందులో ఇబ్బందేమీ లేదు, ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదన్నారు. మార్పులు చేర్పులు సహజమే అన్న ఆమె.. పార్టీ మారాలి అనుకునేది వారి పర్సనల్ వ్యవహారం అన్నారు. టికెట్ల విషయంలో ఫైనల్ డెసిషన్ సీఎం జగన్ దే అని అని తేల్చి చెప్పిన ఆమె.. జగన్ నిర్ణయాలు కొందరికి నచ్చొచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చని కామెంట్ చేశారు.