Sajjala Ramakrishna Reddy : ఏపీలో ముందస్తు ఎన్నికలు..! సజ్జల కీలక వ్యాఖ్యలు

ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో హీట్ పెంచింది. జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని

Sajjala Ramakrishna Reddy : ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో హీట్ పెంచింది. జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన కొత్త చర్చకు దారితీసింది. చంద్రబాబు వ్యాఖ్యలతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా? జగన్ ప్రభుత్వం వైఖరి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై వైసీపీ కీలక నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. తమకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది ఐదేళ్లు పాలించడానికని ఆయన అన్నారు. ప్రజాతీర్పు మేరకు తాము పూర్తి కాలం పాలిస్తామని స్పష్టం చేశారు.

Amazon Deal: 48MP స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందవచ్చు.. ఆఫర్ తెలుసుకోండి!

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని సజ్జల వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం పీఆర్సీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు కలలు మాత్రమే కంటుంటారని విమర్శించిన సజ్జల, సీఎం జగన్ మాత్రం అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని చెప్పారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం జగన్‌పై నమ్మకంతో ప్రజలు అఖండ మెజారిటీని ఇచ్చారని గుర్తు చేసిన సజ్జల.. రెండున్నరేళ్లుగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో ఫలితం ఒకే విధంగా వస్తోందని తెలిపారు.

Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? ఈ సెట్టింగ్‌ మార్చుకోండి.. వేగం పెరుగుతుంది!

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని.. చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాగా, మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ గా ముందస్తు ఎన్నికల గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై.. ప్రతిపక్ష టీడీపీతో పాటు అధికార వైసీపీలోనూ పెద్ద చర్చే జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు