Sajjala Ramakrishna Reddy
Sajjala: వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తూ, ఆ కోణంలోనే తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో విచారణ జరుగుతోందని ఆ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ ఏపీలోని తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
“2019-24 మధ్య లడ్డూ కల్తీ అంటూ భక్తుల మీద విష ప్రచారం చేశారు. రాజకీయ కక్షసాధింపు కోసమే ఇలా ప్రచారం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక జనం నుంచి వ్యతిరేకత వచ్చింది. దాని నుంచి తప్పించుకునేందుకు లడ్డూ ఇష్యూ, పరకామణి కేసులు తెచ్చారు. పరకామణి కేసులో సీఐది హత్య అని ఎలా చెప్పారు? వైసీపీ నేతలే హత్య చేశారంటూ టీడీపీ సోషల్ మీడియాలో ఎలా ఆరోపణలు చేస్తారు? (Sajjala)
చంద్రబాబు చెప్పేదానిలెక్క చూస్తే ఏపీకి ఇప్పటికే కోటి కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలి. నిజంగా వచ్చాయా? రాష్ట్ర ఖజానాని లూటీ చేస్తున్నారు. విశాఖలాంటి ఏరియాలో 99 పైసలకే భూమి ఇచ్చారు. రియల్ ఎస్టేట్ కోసం వాడుకోమని చెబుతున్నారు. హైదరాబాద్‌లోలాగా వేలం వస్తే పెద్ద పరిశ్రమలు వస్తాయి.
Also Read: గుండె గుభేల్‌మనిపిస్తున్న బంగారం ధరలు.. ఎంతగా పెరిగాయో తెలుసా?
ధర కూడా ఎక్కువగా వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం భారీగా వస్తుంది. వందలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే సంస్థలు భూములు కొనలేవా? అమరావతి పేరుతో లక్ష కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నారు. రాజధానిలో పెద్ద ఎత్తున ఎలా కాంట్రాక్టు ఇస్తున్నారు?
రైతుల కోసం చంద్రబాబు ఏం చేశారు? ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. బీమా సౌకర్యం లేదు. జగన్ తెచ్చిన సంస్కరణలను అమలు చేసినా రైతులు బాగుపడేవారు. అది కూడా చేయకుండా ఆపేశారు.
హైదరాబాద్‌లో జగన్ కోసం ర్యాలీ చేశారనే ఆరోపణ సరికాదు. రప్పా రప్పా అనేది సినిమాలోని డైలాగ్. దానికి కూడా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా భయపడుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది” అని అన్నారు.