Sajjala Ramakrishna Reddy: అప్పట్లో ఇవి జీవంలేని ప్రాంతాల్లా ఉండేవి.. కలల ప్రపంచాన్ని చూపారు: సజ్జల

ఇప్పుడు తాము నిజమైన రాజధానికి అర్థం చెబుతూ అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy- R5 zone: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని అమరావతిలో పలు ప్రాంతాల పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన ఆర్-5 జోన్ లో శరవేగంగా ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన పనులు జరుగుతున్నాయని వైసీపీ (YCP) ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. ఈ నెల 24న సీఎం జగన్ (YS Jagan) శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కృష్ణాయపాలెం లే అవుట్ 3లో పైలాన్ ఆవిష్కరిస్తారని అన్నారు.

అక్కడ ఏర్పాట్లను సజ్జల రామకృష్ణ రెడ్డి ఇవాళ పలువురు నేతలతో కలిసి పరిశీలించి అనంతరం మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జీవంలేని ప్రాంతాల్లో వెళ్తున్నట్లుగా రాజధాని గ్రామాలు ఉండేవని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో రాజధాని గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పుకొచ్చారు.

అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజల్లో భ్రమలు సృష్టించారని అన్నారు. కలల ప్రపంచాన్ని మాత్రమే రాష్ట్ర ప్రజలకు చూపించారని చెప్పారు. ఇప్పుడు నిజమైన రాజధానికి అర్థం చెబుతూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని చెప్పారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు బుద్ధి తెచ్చుకోకుండా మళ్లీ కోర్టులకు వెళ్తున్నారని తెలిపారు. ప్రైవేట్ లే అవుట్లకు దీటుగా ఇళ్లు నిర్మిస్తామన్నారు.

ఏపీ మంత్రి మేరుగు నాగార్జున ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల స్థితిగతులను మెరుగు పర్చాలని ఇక్కడ ఇళ్లు నిర్మించాలని జగన్ సంకల్పించారని చెప్పుకొచ్చారు. మోసానికి గురైన పేద వారికి రాజధానిలో ఇళ్లు కట్టించాలని జగన్ దీక్షపూనితే చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టు వద్దు అనదని చెప్పారు.

Nara Lokesh : ఎందరో మహానుభావులు.. ఒక్కరే ‘చీప్’ మినిస్టర్ అంటూ ట్విట్టర్‌లో నారా లోకేశ్ సెటైర్లు