Sajjala Ramakrishna Reddy : కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. వేధించడం అంటే ఉండాలో మాకు నేరుతున్నారని చంద్రబాబు సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. వైసీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చాక మా వాళ్ళు చెప్పినా వినే పరిస్థితి ఉండదు..
మాజీ ఎంపీ నందిగం సురేశ్ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి నాలుగు నెలలు అవుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈరోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్ళమన్నారాయన. మేము తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. నాలుగేళ్ల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా వినే పరిస్థితి ఉండదని హెచ్చరించారు సజ్జల.
కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారని చెప్పారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదని వాపోయారు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నామన్నారు. వైసీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు సజ్జల.
Also Read : మేము అధికారపక్షం కాదు ప్రతిపక్షం కాదు, ఆ రెండు కూటములకు దూరం- విజయసాయిరెడ్డి
ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి..
సోషల్ మీడియాలో మహిళలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో 30 ఏళ్ళ క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు సజ్జల. కొత్త కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారని అన్నారు.
గుంట నక్కల్లా వ్యవహరించడం వైసిపికి తెలియదన్నారు. మీ కంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైసీపీకి ఉందన్నారు. నాలుగేళ్ళలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా వినే పరిస్థితి ఉండదని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.
Also Read : 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నాం: ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి