GV Reddy: 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నాం: ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్‌ జీవీ రెడ్డి

అవినాశ్ రెడ్డి, మాజీ ఎండీ మధుసూధన్ రెడ్డి లాంటి వారు ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు.

GV Reddy: 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నాం: ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్‌ జీవీ రెడ్డి

Updated On : December 24, 2024 / 3:56 PM IST

వైసీపీ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్ పరిస్థితిపై ఆ సంస్థ ఛైర్మన్‌ జీవీ రెడ్డి ఇవాళ మీడియాకు పలు వివరాలు తెలిపారు. అమరావతిలో ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “అప్పట్లో 108 మంది ఉద్యోగులతో సంస్థను నడిపారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్యను 1,200 చేసింది.

అప్పట్లో కడప జిల్లా ఎంపీ రికమండేషన్ చేసిన వారే వారిలో ఎక్కువ మంది ఉన్నారు. ఫైబర్ నెట్ లో వైసీపీ ప్రభుత్వ పాలనలో వాట్సాప్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు. కొంతమంది ఇళ్లలో పని చేస్తున్న వారి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అవినాశ్ రెడ్డి, మాజీ ఎండీ మధుసూధన్ రెడ్డి లాంటి వారు ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నాం.

Sandhya Theatre Incident : సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడు అరెస్ట్.. అతని వల్లే ఇలా అయ్యిందా..?

న్యాయస్థానాల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలగిస్తున్నాం. వీళ్లందరూ ఏపీ ఫైబర్ నెట్ లో సమర్థంగా పని చేయడం లేదు. కోట్ల రూపాయలు జీతాలు ఇస్తున్నారు. వీళ్లందరూ ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లలో పని చేస్తున్న వారే. వారిని ఉద్యోగాల్లో నుంచి తీస్తున్నది ఎవరిపైనా కోపంతోగానీ, కక్ష్యతోగానీ కాదు. తొమ్మిది వందల కోట్ల టోటు బడ్జెట్ ఉంది. అపాయింట్మెంట్స్ లేవు.. ఎవరైనా సంస్థను ఇబ్బందులు పెట్టాలని చూస్తే అలాంటి వారిపై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటాం” అని జీవీ రెడ్డి చెప్పారు.