Andhra Pradesh
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే తదుపరి ప్రధాన కార్యదర్శి గా సమీర్ శర్మ పేరును ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం జీవో విడుదల చేసింది. 1985 బ్యాచ్ కి చెందిన సమీర్ శర్మ అక్టోబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. శర్మ ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు.