తిరుమలలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

తిరుమలలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

Updated On : September 14, 2019 / 8:27 AM IST

తిరుమలలో పౌర్ణమి రోజైన శనివారం మాదిరి బ్రహోత్సవ గరుడ సేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. మలయప్పస్వామి తన ఇష్టమైన గరుడ వాహనంపై శనివారం రాత్రి 7గంటల నుంచి 9గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు. సెప్టెంబరు 30నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకూ శ్రీవారి సాలకుట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 

సాధారణంగా ప్రతి ఏడాది ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడ సేవను నిర్వహించడం ఆనవాయితీ. శుక్రవారం సర్వభూపాల వాహనాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వాహనాన్ని నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.