సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా స్కూల్స్ రీ ఓపెన్

సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా స్కూల్స్ రీ ఓపెన్

Updated On : August 12, 2020 / 4:47 PM IST

ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఓ వైపు కరోనా వైరస్ గురించి భయాందోళనలో మునిగిన ప్రజల్లో మార్పులు తీసుకొచ్చి స్కూల్స్ కు వచ్చేలా చూస్తామని చెప్పారు.

‘విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. కరోనా నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. చిన్నపిల్లలను బడికి పంపడంలో ఎటువంటి ఇబ్బందులు లేవనే నమ్మకం వచ్చాకే స్కూల్స్ ఓపెన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆగష్టు చివరి వారంలో స్కూళ్ల ప్రారంభంపై మరోసారి సమీక్ష నిర్వహిస్తాం. సెప్టెంబర్ 3వ వారం నుంచి ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు మంత్రి అన్నారు.