Kodali Nani : బాబు అధికారంలోకి వచ్చేది లేదు.. చేసేది లేదు, రాధాకి 2 + 2 గన్‌‌మేన్స్

తనకి హాని తలపెట్టే కార్యక్రమం జరుగుతుందని వంగవీటి రాధా తమ దృష్టికి తీసుకువచ్చాడన్నారు. ఈ విషయంపై సీఎం దృష్టికి తీసుకువెళ్ళగా..

Kodali Nani : బాబు అధికారంలోకి వచ్చేది లేదు.. చేసేది లేదు, రాధాకి 2 + 2 గన్‌‌మేన్స్

Kodali Nani

Updated On : December 27, 2021 / 10:04 PM IST

Vangaveeti Radha : టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు.. చేసేది లేదని, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఎన్నికల్లో ఎందుకు తమకు ప్రజలు పట్టం కడుతారని అన్నారు మంత్రి కొడాలి నాని. తనకి హాని తలపెట్టే కార్యక్రమం జరుగుతుందని వంగవీటి రాధా తమ దృష్టికి తీసుకరావడంతో సీఎం జగన్ ను కలిసి ఈ విషయంపై మాట్లాడడం జరిగిందన్నారు. విచారణ చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ క్రమంలో రాధాకి 2 ప్లస్ 2 గన్ మేన్స్ ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారాయన. టీడీపీ ఉనికి కోసం ఓటీఎస్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నట్లు, చంద్రబాబు పిలుపుకు టీడీపీ నేతలు మమా అన్నట్టు ధర్నాలు చేశారని ఎద్దేవా చేశారు.

Read More : Rajahmundry ORR : రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేసిన కేంద్రం

ఓటీఎస్ అనేది బలవంతపు కార్యక్రమం కాదని..ఇదొక స్వచ్చందంగా చేసుకునేదన్నారు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్కరికి కూడా సొంతంగా ఇంటి హక్కు ఇవ్వలేదని గుర్తు చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఓటీఎస్ అంటున్నారని, బాబు దొంగ మాటలు నమ్మకుండా 52 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండన్నరేళ్లుగా ఎన్నిక వచ్చినా వార్ వన్ సైడేనని, తిరుపతి, బద్వేల్ లో బీజేపీకి డిపాజిట్లు రాలేదన్నారు. వంగవీటి రాధాకృష్ణ అంశంపై కూడా మంత్రి కొడాలి నాని స్పందించారు.

Read More : Telangana : తెలంగాణలో ఒక్కరోజే ఒమిక్రాన్ 12 కేసులు..హాఫ్ సెంచరీ దాటేశాయి

తనకి హాని తలపెట్టే కార్యక్రమం జరుగుతుందని వంగవీటి రాధా తమ దృష్టికి తీసుకువచ్చాడన్నారు. ఈ విషయంపై సీఎం దృష్టికి తీసుకువెళ్ళగా…విచారణ చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు  ఇచ్చారన్నారు. రాధాకి 2 ప్లస్ 2 గన్ మ్యాన్స్ ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు… మంగళవారం ఉదయానికి ఇద్దరు గన్ మ్యాన్ లు నియమిస్తారన్నారు. రాధా దగ్గర ఉన్న ఆధారాలు ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు. గతంలో రంగా గారు ఇలానే ప్రాణ హాని ఉందని అనుమానం వ్యక్తం చేస్తే…అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాధాకి వైసీపీ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని.. టీడీపీలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. తాను రంగా గారి కార్యక్రమల్లో పాల్గొనడం జరిగిందని వివరణనిచ్చారు. వైసీపీలోకి రావాలని వంగవీటి రాధాను ఆహ్వానించలేదు.. అలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.