జమిలి ఎన్నికలు రావాలని ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

ఆరు నెలల్లో అన్ని బాదుడే బాదుడే అని ప్రజలు అంటున్నారని సీదిరి అప్పలరాజు అన్నారు.

Seediri Appalaraju

జమిలి ఎన్నికలు రావాలని ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. “సూక్తులు మాని హామీలు ఇంప్లిమెంట్ చేయండి. ముందు మ్యానిఫేస్టోలోని సూపర్ సిక్స్ అమలు చేయండి. జమిలి ఎన్నికలు రావాలని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు” అని సీదిరి అప్పరాజు చెప్పారు.

ఆరు నెలల్లో అన్ని బాదుడే బాదుడే అని ప్రజలు అంటున్నారని సీదిరి అప్పలరాజు అన్నారు. ఉచిత పంటల బీమాని తీసేయడం దారుణమని చెప్పారు. రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు తాము వైసీపీ హయాంలో ఉచిత బీమా తెచ్చామని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం బీమా కట్ట లేదని చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కూడా సక్రమంగా సేకరించడం లేదని తెలిపారు.

“స్వర్ణాంధ్ర కోసం కాదు డాక్యుమెంట్… అన్నపూర్ణ లాంటి ఆంద్ర.. అరాచక ఆంద్రప్రదేశ్ అయ్యింది. మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఇంకా సూక్తులు మాట్లాడుతున్నారు” అని సీదిరి అప్పలరాజు మండిపడ్డారు.

Pawan Kalyan: స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో సీఎం చంద్రబాబుపై పవన్ ప్రశంసలు.. ఉన్నతాధికారులకు హితబోధ