తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దూకుడు..

ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి ఆధారాలు సేకరించవచ్చు? ఎవరెవరిని విచారించవచ్చు? ఏయే ప్రాంతాలకు వెళ్లవచ్చు?..

Ttd Laddu Row : తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుపతిలో సిట్ బృందం వివరాలు సేకరించే పనిలో ఉంది. టీటీడీ ఈవో నుంచి వివరాలు సేకరిస్తోంది సిట్. పద్మావతి అతిథి గృహంలో సమావేశమైన సిట్ బృందం అన్ని వివరాలను పరిశీలిస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ బృందం ఈ మధ్యాహ్నం తిరుపతి చేరుకుంది. వారు రావడంతోనే నేరుగా తిరుమల కొండపైకి వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరిగి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సిట్ బృందం సభ్యులు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు.

మొదటిసారి ఆ బృందం సభ్యులంతా ఈ అతిథి గృహంలోనే భేటీ అయ్యారు. ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి ఆధారాలు సేకరించవచ్చు? ఎవరెవరిని విచారించ వచ్చు? ఏయే ప్రాంతాలకు వెళ్లవచ్చు? అన్న అంశంపైన సిట్ సభ్యులంతా చర్చించారు. ప్రత్యేకించి ఇప్పటికే టీటీడీ అధికారికంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి బాధ్యులుగా చెబుతూ ఏఆర్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ సంస్థపైన ఫిర్యాదు చేసింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సిట్ బృందం టీటీడీ ఇచ్చిన కంప్లైంట్ కాపీని తెప్పించుకుంది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనే అంశాన్ని సిట్ సభ్యులు పూర్తి స్థాయిలో పరిశీలించారు.

Also Read : జాగ్రత్త.. అంటూ పార్టీ నేతలను హెచ్చరించిన సీఎం చంద్రబాబు..

రేపటి(సెప్టెంబర్ 29) నుంచి అధికారికంగా సిట్ బృందం విచారణ షురూ చేయబోతోంది. రేపు ఉదయం సిట్ బృందం సభ్యులు రేపు తిరుమలకు వెళ్లనున్నారు. ప్రధానంగా టీటీడీ ఈవోతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆలయంలో లడ్డూల తయారీ పోటుని పరిశీలించబోతున్నారు. ఇక అవసరమైతే వచ్చే రెండు రోజుల్లో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు రాష్ట్రం దిండిగల్ లో ఉన్న ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్ కంపెనీకి సిట్ బృందం సభ్యులు వెళ్లే అవకాశం ఉంది. ీ మేరకు అక్కడి అధికారులతోనూ వీరు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఒకసారి అక్కడికి వెళ్లి ఆ డెయిరీ ప్రొడక్ట్ కంపెనీ ఎలా ఉంది? నిజంగా అక్కడ కల్తీ జరిగే అవకాశం ఉందా? ట్రాన్స్ పోర్టు ఎలా ఉంది? అనే అంశాలను స్వయంగా ఫ్యాక్టరీకే వెళ్లి సిట్ బృందం సభ్యులు పరిశీలించే అవకాశం ఉంది.