Guntur: గుంటూరు అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం.. పోలీసుల అదుపులో 25మంది!

కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, రాణిగారితోట ప్రాంతాల్లో విజయవాడ, గుంటూరు పోలీసులు కలిసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ నిందితులను గుర్తించే అవకాశముంది.

Guntur (2)

Guntur: ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా యువతి అత్యాచారం కేసులో పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గ్యాంగ్ రేప్ పాతనేరస్థుల పనేనని అనుమానించిన పోలీసులు.. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ స్థానరాల్లో దాడులు చేపట్టారు.

ఇందులో 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే ఘటనాస్థలంలో వేలిముద్రలు సేకరించిన పోలీసులు పాత నేరస్థుల వివరాలతో పోల్చి చూస్తున్నారు. కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, రాణిగారితోట ప్రాంతాల్లో విజయవాడ, గుంటూరు పోలీసులు కలిసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ నిందితులను గుర్తించే అవకాశముంది.