Ttd Snake Catcher Bhaskar Naidu
Snake Catcher Suresh Health Update : ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేశ్.. ఎట్టకేలకు నాగుపాము కాటు నుంచి కోలుకున్నారు. అతనికి ప్రాణాపాయం లేదని ప్రకటించారు కొట్టయం మెడికల్ సూపరింటెండెంట్. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. ఇప్పటివరకు 50 వేలకు పైగా పాములను, 190కి పైగా కింగో కోబ్రాల ప్రాణాలను కాపాడిన సురేశ్.. నివాస స్థలంలో 10 అడుగల పామును పట్టుకొని గోనె సంచిలో వేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. పాము కాటు వేసినప్పటికీ దాన్ని సురక్షితంగా గోనె సంచిలో ఉంచే ప్రయత్నం చేశాడు.
Read More : Weather Forecast : శని, ఆదివారాల్లో హైదరాబాద్ లో పెరగనున్న చలిపులి- ఏపీలో పొడి వాతావరణం
అయితే.. పాము కాటు వేసిన కొద్ది నిమిషాల తర్వాత సురేష్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు వెంటనే కొట్టాయం ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందిన సురేశ్ శ్వాస తీసుకోవడం ప్రారంభించాడని.. అతని ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించిందని వెల్లడించారు వైద్యులు. సురేశ్‌ను మరో రెండు రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామన్నారు డాక్టర్లు.
Read More : VJ Sunny : ఫ్రెండ్స్ వల్లే బిగ్‌బాస్ విన్నర్ అయ్యాను.. VJ సన్నీ ‘సకల గుణాభిరామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఎవరి ఇళ్లలోకి పాములు వచ్చినా.. వెంటనే ఫోన్ చేస్తే సురేష్ ఎక్కడికి వెళ్లి ఆ పాములను పట్టుకునే వాడు. పట్టుకున్న పాములను రక్షించి వాటిని అడవిలోకి వదిలేసేవాడు. ఇలా పాములను పట్టుకునే క్రమంలో 2020లో కూడా పాము కాటుకు గురయ్యాడు సురేష్. అప్పుడు తిరువనంతపురంలోని ఒక ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో కొన్ని వారాల పాటు చికిత్స పొందాడు.