Somu Veerraju : నో కన్‌ఫ్యూజన్.. జనసేనతో పొత్తుపై సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు

Somu Veerraju : బీజేపీ అగ్రనేతలను కలిశాక పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మాకు ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదని సోమువీర్రాజు స్పష్టం చేశారు.

Somu Veerraju (Photo : Twitter)

Somu Veerraju : ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు అంశంపై ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ.. జనసేనతో పొత్తులో ఉందని ఆయన తేల్చి చెప్పారు. పొత్తు విషయంలో మాకు క్లారిటీ ఉందన్నారు. పొత్తుల విషయంలో ఏది జరగాలో అది జరుగుతుందన్నారు. జనసేన ఎన్డీయేతో పొత్తులో ఉందని సోమువీర్రాజు గుర్తు చేశారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక చర్యల మీద జనసేనతో కలిసి పోరాటం చేస్తూ ముందుకెళ్తామన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనేతలను కలిశాక పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదని సోమువీర్రాజు స్పష్టం చేశారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక చీలకుండా ఉండటంపై బీజేపీ పెద్దలతో పవన్ తన వైఖరి చెప్పారని సోమువీర్రాజు వెల్లడించారు.

Also Read..Rudraraju Gidugu: కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థుడు.. వెన్నుపోటు పొడిచి పారిపోయాడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడంపై సోమువీర్రాజు స్పందించారు. కిరణ్ రాకతో ఏపీ, తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితమే కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి రావాలని తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించామని సోమువీర్రాజు తెలిపారు.

Also Read..Pawan Kalyan : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ బీజేపీ, జనసేన లక్ష్యం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం-పవన్ కల్యాణ్

కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని బలోపేతం చేసే అంశం పై కిరణ్ కుమార్ రెడ్డి తో చర్చించానని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కిరణ్ కుమార్ రెడ్డి సేవలు ఉపయోగించుకుంటామన్నారు.