SomuVeerraju: చంద్రబాబుపై సోము వీర్రాజు ఆగ్రహం.. మాది గల్లీ పార్టీ కాదు.. పద్దతి మార్చుకో..

ఏపీలో పార్టీల మధ్య పొత్తు విషయంపై మేము సమాధానం చెప్పడానికి మాది గల్లీ పార్టీకాదు, జాతీయపార్టీ. దీనిపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారు అని సోమువీర్రాజు చెప్పారు.

Somuveerraju

AP BJP President: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (Somuveerraju) విరుచుకుపడ్డారు. తాను సీఎంగా ఉండబట్టే జగన్ (Jagan) గతంలో పాదయాత్ర చేయగలిగాడుఅని చెప్పిన చంద్రబాబు.. ఆరోజు ఒక్కచర్య తీసుకోకుండా ఈరోజు ఆయనపై కేంద్రమే చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యలు చేయడం వెనుకాల ఎవర్ని టార్గెట్ చేయాలని అనుకుంటున్నాడు అంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబుచేస్తే నానుండి కూడా చాలా అంశాలు బయటికొస్తాయి అంటూ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లో 500మంది బీజేపీ కార్యకర్తలను చంపేశారు. వారిపై మేము ఏం చర్య తీసుకున్నాం. వారిపై ఫైట్ చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చేయాలి. ప్రతిఒక్కరూ ప్రాణహాని ఉందని సెక్యూరిటీ కల్పించాలని కోరితే కేంద్రం అందరికీ కల్పించలేదని సోము వీర్రాజు అన్నారు.

Somu Veerraju : ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల‌ పాలనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ 50 లక్షల‌ కరపత్రాల‌ పంపిణీ

ఫైట్ చేయడం దమ్మున్న రాజకీయ పార్టీ లక్షణం. అనాదిగా కమ్యూనిస్టు పార్టీలు మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చంపేస్తే అక్కడ ఆ పార్టీని రద్దుచేయలేదే. దమ్ముంటే చంద్రబాబును ఒక వేదికపైకి రమ్మనండి చర్చిస్తాం. మా హోమంత్రి అమిత్ షాపై ఆరోజు చంద్రబాబు రాళ్లు వేయిస్తే ఎటువంటి చర్యలు తీసుకున్నారు. అమిత్ షా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చినవారిపై చంద్రబాబు కేసులు పెట్టించాడా? అంటూ సోమువీర్రాజు ప్రశ్నించారు. మీరు మాత్రం ఏపీలో అధికారంలోకి రావాలి, బీజేపీ మాత్రం అన్నింటికి సమాదానం చెప్పాలనడం మంచి పద్దతికాదని అన్నారు.

Chandrababu : 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండీ .. లేదంటే తప్పుకోండీ : చంద్రబాబు వార్నింగ్

మీ వైఖరి మంచిది కాదు, పద్దతి మార్చుకోవాలని చంద్రబాబుకు తెలియజేస్తున్నానని సోమువీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పాడు. ఈరోజు ఆయనే సభలు పెడుతున్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నాడో ఎవరైనా ఆయనను ప్రశ్నిస్తున్నారా? భారతదేశ ప్రధాని నియామకంలో చక్రంతిప్పిన చంద్రబాబు.. ఆరోజు రైల్వేజోన్ ఏపీకి ఎందుకు పెట్టించలేక పోయాడంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీలో పార్టీల మధ్య పొత్తు విషయంపై మేము సమాధానం చెప్పడానికి మాది గల్లీ పార్టీకాదు, జాతీయపార్టీ. దీనిపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారు అని సోమువీర్రాజు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు