Somu Veerraju : ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల‌ పాలనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ 50 లక్షల‌ కరపత్రాల‌ పంపిణీ

స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ అభివృద్ధి చేశారు. మోదీ ఈ‌తొమ్మిదేళ్ల పాలనలో నవ భారత్ ఆవిష్కృతమైంది. ఈ‌ విషయం మోర్గాన్ అనే పెద్ద సంస్థ లే‌ చెబుతున్నాయని వెల్లడించారు.

Somu Veerraju : ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల‌ పాలనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ 50 లక్షల‌ కరపత్రాల‌ పంపిణీ

AP BJP President Somu Veerraju

AP BJP President Somu Veerraju: ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల‌ పాలనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ 50 లక్షల‌ కర పత్రాల‌ పంపిణీకి శ్రీకారం చుట్టింది. కరపత్రాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆవిష్కరించారు.ఈ కరపత్రాల ద్వారా మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి,సంక్షేమాల గురించి ప్రజలు తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతు..మే 20 నుంచి నెలాఖరు వరకు ఈ కర పత్రాల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు.బీజేపీని ప్రజలకు చేరవచేసేలా ఈకార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ 9090902024 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు.

 

ఈ కార్యక్రమం గురించి..బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతు..స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ అభివృద్ధి చేశారని..మోదీ ఈ‌తొమ్మిదేళ్ల పాలనలో నవ భారత్ ఆవిష్కృతమైందని అన్నారు.
ఈ‌ విషయం మోర్గాన్ అనే పెద్ద సంస్థ లే‌ చెబుతున్నాయని వెల్లడించారు. గతంలో పేద, ధనిక మధ్య భారీ వ్యత్యాసం ఉండేదని కానీ మోదీ పాలనలో పేదలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచిన ఘతన మోదీ ప్రభుత్వానిదేనన్నారు. భారతదేశం నుంచే ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేసిన మోదీ ప్రభుత్వంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిసారని ఈ సందర్భంగా సుజనా చౌదరి గుర్తు చేశారు.

Prasad V Potluri : ఏందయ్యా కేశినేని నానీ.. నీ బిల్డప్, వెధవ సోది ఆపు : వైసీపీ నేత PVP సెటైర్లు

భారతదేశంలో జనాభాలో చైనాను మించి పోయిందని అయినా కోవిడ్ సమయంలో ప్రాణ నష్టం చాలా వరకు నివారించింది బీజేపీ పాలన అని అన్నారు. ఏపీలో విభజన చట్టంలో ఉన్న అనేక అంశాలను మోడీ అమలు చేశారని..మోడీ పాలనలో ఏపీకి పలు విద్యా సంస్థలు, ఎయిమ్స్, జాతీయ రహదారులు నిర్మాణం జరిగిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అసమర్థత వల్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదని.. ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కూడా కేటాయించలేదని విమర్శించారు.

 

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం సిద్దంగా‌ ఉందని.. గత, ప్రస్తుత ప్రభుత్వాల వల్ల‌ పోలవరం ఆలస్యం అయ్యుందని అన్నారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా జగన్ నాశనం చేశారని..మోడీ నిధులు ఇచ్చినా మూడు రాజధానులు పేరుతో రాష్ట్ర అభివృద్ధిని ఆపేశారని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలకు కూడా విడతల వారీగా కేంద్రం నిధులు ఇచ్చిందని,మోడీ పాలనపై ప్రపంచ దేశాలు సైతం చర్చ చేసుకుంటున్నారని తెలిపారు.ఎక్కడకి‌ వెళ్లినా మోడీ ధైర్యంగా మన దేశం గొప్పతనం గురించి చాటి చెబుతున్నారని అన్నారు. ఏపీ కూడా మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందాలని దాని కోసం ప్రతీ బీజేపీ కార్యకర్త కృషి చేయాలని సూచించారు.

AP Politics: భీమవరంలో హైటెన్షన్.. వైసీపీ-జనసేన ఫ్లెక్సీ వార్‭పై ఆందోళనకు పిలుపు, ముందస్తు అరెస్టులు

దేశంలో మొదటి‌ ఐదు స్థానాల్లో ఏపి ఉంటుందని..మోడీ సారధ్యంలో భారత దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి వచ్చిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ పొత్తుల మీద మా అధిష్టానంతో చర్చలు జరిపారని..బీజేపీ, జనసేన పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయని..బీజేపీ అధిష్టానం ఏమి చెబితే మేము అలాగే నడుస్తాం అని తెలిపారు. వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి కేంద్రం ఎక్కువ సాయం చేసిందని..ఈ‌ విషయం లో చర్చకు ఎవరొచ్చినా నేను సిద్దంగా ఉన్నామన్నారు. రాజకీయంగా రాష్ట్రంలో బీజేపీ లబ్ది పొందలేక పోయింది కానీ..అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం సాయం అందిస్తూనే ఉందన్నారు. ఏపీలో బీజేపీ రాజకీయంగా లబ్ది పొందడానికి సమయం పడుతుందన్నారు సుజనా చౌదరి.