Prasad V Potluri : ఏందయ్యా కేశినేని నానీ.. నీ బిల్డప్, వెధవ సోది ఆపు : వైసీపీ నేత PVP సెటైర్లు

కేశినేనీ నీ వెధవసోది ఆపు..నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు...ఏంటీ నీ బిల్డప్ ఏందయ్యా.. దొబ్బేది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు ఇంకా ఏంటో.. ప్రజాసేవల చేయటానికే వచ్చానంటావు ఏంటీ నీ బిల్డప్..?

Prasad V Potluri :  ఏందయ్యా కేశినేని నానీ.. నీ బిల్డప్, వెధవ సోది ఆపు : వైసీపీ నేత PVP సెటైర్లు

MP Kesineni Nani..PVP

Prasad V Potluri – Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (PVP) సెటైర్లు వేశారు. ‘ఏంటీ నీ వెధవసోది ఆపు.. నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. ఏంటీ నీ బిల్డప్ ఏందయ్యా అంటూ ఎద్దేవా చేశారు. దొబ్బేది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు ఇంకా ఏంటో.. ప్రజాసేవల చేయటానికే వచ్చానంటావు ఏంటీ నీ బిల్డప్ ఏంటయ్యా బాబూ అంటూ ఏకి పారేశారు. మన బెజవాడోళ్లందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి. వెధవ సోది ఆపి, కొవ్వు కరిగించే పనిలో ఉండు.. తర్వాత ఎన్నికలకు దొర్లుకుంటూ వద్దువు’ అని ట్విటర్ వేదికగా కేశినేని నానిని ఇష్టానురీతిగా ఏకిపారేశారు పొట్లూరి. కాగా..గత ఎన్నికల్లో కేశినేని నానిపై వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ ఓడిపోయారు.

కాగా ఇటీవల కాలంలో టీడీపీపై గుర్రుగా ఉన్న విజయవాడ(Vijayawada) ఎంపీ కేశినేని నాని టికెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా నాకేంటీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానేమో అంటూ వ్యాఖ్యానించారు.

Kesineni Nani : ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా అభ్యంతరం లేదు.. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా గెలుస్తానేమో : కేశినేని నాని

వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి ఏ పిట్టల దొరకు టీడీపీ టిక్కెట్టు ఇచ్చినా తనకు ఇబ్బంది లేదని నిన్న కేశినేని నాని వ్యాఖ్యానించారు. తనకు టీడీపీ టిక్కెట్టు వస్తుందా రాదా అనే విషయమై బెంగలేదన్నారు. ప్రజలు కోరుకుంటే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానేమోనని కూడా కేశినేని నాని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై పార్టీ చర్యలు తీసుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా కొన్ని రోజుల క్రితం వైసీపీ నేతలపై ప్రశంసలు కురిపించిన కేశినేని హాట్ టాపిక్ గా మారారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ (Nandigama) చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో ఎంపీ నిధులతో రూ.47.00 లక్షలతో నిర్మించిన 90 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ వాటర్‌ ట్యాంక్‌ను టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రారంభించిన సందర్భంగా నాని వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నారని అన్నారు.

Kesineni Nani: వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసల జల్లు.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్

అభివృద్ధి కోసం ఎంపీ నిధులు కేటాయిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు సహకరిస్తానని చెప్పారు. రాజకీయాలు ఎన్నికలకే పరిమితమైతే బాగుంటుందని అన్నారు. దీంతో నాని వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ డౌటేననేలా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. అలాగే నాని వైసీపీలో చేరతారేమో అనే వార్తలు కూడా వస్తున్నాయి.