AP Politics: భీమవరంలో హైటెన్షన్.. వైసీపీ-జనసేన ఫ్లెక్సీ వార్‭పై ఆందోళనకు పిలుపు, ముందస్తు అరెస్టులు

‘పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం’ పేరుతో రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫెక్సీలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది

AP Politics: భీమవరంలో హైటెన్షన్.. వైసీపీ-జనసేన ఫ్లెక్సీ వార్‭పై ఆందోళనకు పిలుపు, ముందస్తు అరెస్టులు

YCP Janasena Flexi War: అధికార వైఎస్ఆర్‭సీపీ, జనసేన పార్టీల మధ్య కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్‭తో భీమవరంలో హైటెన్షన్ నెలకొంది. ఈ ఘటనల్ని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరాజు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో జనసేన పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. గోవిందరావు నివాసం వద్ద జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం గోవిందరావును అరెస్టు చేసి పోలీస్ స్టేషనుకు తరించారు. పెత్తందారులకు పేదలకు మధ్య పోరాటం పేరుతో పవన్ కళ్యాణ్‭ను కించపరుస్తూ అధికారపార్టీ ఫ్లెక్సీలు వేసింది.

Andhra Pradesh : విజయవాడలో కలకలం.. ఆ నలుగురు ఉద్యోగులు అరెస్ట్, ఆందోళనలో కుటుంబసభ్యులు

కాగా, తమపై అధికార పార్టీ దౌర్జన్యానికి పాల్పడుతోందని గోవిందరాజు అన్నారు. ఫ్లెక్సీ వార్‭ నేపథ్యంలో ప్రభుత్వంపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని గోవిందరావు ముందుగానే హెచ్చరించారు. కాగా, భీమవరం పార్టీ ఆఫీసులో కార్యకర్తల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం ఈ సమావేశం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ముందుగానే జనసేన పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు.

OTT : ఓటీటీలకు షాక్ ఇచ్చిన కేంద్రం.. ఇకపై ఓటీటీ సినిమాలకు కూడా ఆ యాడ్స్ ఉండాల్సిందే..

‘పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం’ పేరుతో రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫెక్సీలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే కించపరిచేలా ఉన్న ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరుతూ జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆదివారం కొన్ని ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేదలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అడ్డుగా మోకాళ్లపై కూర్చుని.. పెత్తందార్లతో పోరాడుతున్నట్టుగా ఈ ఫ్లెక్సీల్లో ఉంది. ఎదురుగా పల్లకీ మీద టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ఉండగా.. జనసేన పార్టీ అధినేత పవన కల్యాణ్‌ ఆ పల్లకీని మోస్తున్నట్టుగా చూపించారు.