Andhra Pradesh : విజయవాడలో కలకలం.. ఆ నలుగురు ఉద్యోగులు అరెస్ట్, ఆందోళనలో కుటుంబసభ్యులు

Andhra Pradesh : 1వ తేదీనే జీతాలు ఇవ్వమని మేము గవర్నర్ ను కలిసినందుకు ప్రభుత్వం మాపై కక్ష కట్టింది. సస్పెన్షన్లు, అరెస్టులకు మేము భయపడం.

Andhra Pradesh : విజయవాడలో కలకలం.. ఆ నలుగురు ఉద్యోగులు అరెస్ట్, ఆందోళనలో కుటుంబసభ్యులు

Andhra Pradesh (Photo : Google)

Andhra Pradesh – Employees Arrest : ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ కు చెందిన నలుగురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీవో మెహర్ కుమార్, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ సంధ్య, సీనియర్ అసిస్టెంట్ చలపతి, ఆఫీస్ సబార్డినేట్ సత్యనారాయణలను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు మఫ్టీలో వచ్చిన పోలీసులు గుడివాడలో ఇద్దరు, విజయవాడలో మరో ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నట్టు సంఘం నేతలు తెలిపారు.

గుడివాడలో డిప్యూటీ కమిషనర్ సంధ్యను కూడా పోలీసులు తీసుకెళ్లినట్టు సంఘం నేతలు చెబుతున్నారు. గతంలో ఈ నలుగురు ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందారు. ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు. ఇంతలోనే కలకలం రేపింది.(Andhra Pradesh)

సూర్యనారాయణ.. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోషియేషన్ అధ్యక్షుడు:
1వ తేదీనే జీతాలు ఇవ్వమని మేము గవర్నర్ ను కలిసినందుకు ప్రభుత్వం మాపై కక్ష కట్టింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరుతున్నాం. పేపర్ లో రెండేళ్ల క్రితం వచ్చిన వార్తను పట్టుకొని ఉద్యోగులను సస్పెండ్ చేశారు. హైకోర్టు సస్పెన్షన్లను కొట్టివేసింది. అప్పట్లో 9మందిపై విచారణకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇంకా అమలు కాలేదు.

Also Read..YS Viveka case: ఆ సత్తా టీడీపీకి ఉంది.. వెన్నతో పెట్టిన విద్య: సజ్జల రామకృష్ణారెడ్డి

అరెస్ట్ అయిన మా ఆఫీస్ బేరర్లలో ఒకరి ఇంట్లో పెళ్లి ఉంది. మరొకరికి ఇటీవల స్టంట్ వేశారు. ఏ కేసులో ఉద్యోగులను అరెస్ట్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా కుటుంబసభ్యులకు చెప్పలేదు. సస్పెండ్లు, అరెస్టులు చేస్తే భయపడం. చీఫ్ సెక్రటరీ ఉద్యోగుల అరెస్ట్ పై నోరు మెదపాలి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. వారి నిజాయితీ వారు నిరూపించుకుంటారు. ఇంత అరాచకంగా ప్రభుత్వం ప్రవర్తించడం న్యాయమా?(Andhra Pradesh)

సంధ్య భర్త శివరామిరెడ్డి:
ఫ్యాక్షనిస్టుల్లాగా దౌర్జన్యంగా వచ్చి నా భార్య సంధ్యను అరెస్ట్ చేశారు. డ్రైవర్ కంగారుతో ఫోన్ చేశాడు. వెంటనే నా భార్యను కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశాను. డయల్ 100 కు రెండు సార్లు ఫోన్ చేసినా వాళ్లు రఫ్ గా సమాధానం చెప్పారు. పోలీసులు ఏం చేయాలని నా భార్యను తీసుకెళ్లారు. చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. ఒక ప్రాణాన్ని కాపాడాలి. రౌడీల్లాగా, మానభంగం చేసే వారిలాగా నా భార్యను తీసుకెళ్లారు. నేను బతకడం వృథా. డీజీపీ సమాధానం చెప్పాలి.

మెహర్ భార్య..
కనీసం నా ఫోన్ ను కూడా లిఫ్ట్ చేయనివ్వలేదు.

మెహర్ కుమారుడు..
నాన్న షుగర్ పేషెంట్. స్టంట్ వేశారు. మా నాన్నను నేను చూడాలి. పోలీస్ స్టేషన్లు తిరిగినా సమాధానం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు.(Andhra Pradesh)

ఆస్కార్ రావు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి:
చట్ట విరుద్ధంగా ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ చేశారో లేదో కూడా చెప్పాలి. అనైతిక చర్యలను సహించం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. సీఎస్ విధానాలు మార్చుకోవాలి. సమాధానం చెప్పాలి.

అటెండర్ సత్యనారాయణ భార్య సుజాత..
నా భర్తను ఎక్కడికీ తీసుకెళ్లారో తెలియదు. అలాగే వాళ్ల భార్యా బిడ్డలను అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా? నాకు ఉన్నది ఒక్క కూతురు. అటెండర్ ఏం కుంభకోణం చేస్తాడు? నేను జగన్ కు ఓటు వేశా. ఓటు వేసినందుకు ఇలా చేస్తారా?

Also Read..Chandrababu House : చంద్రబాబు ఇంటి జప్తు..? కోర్టు తీర్పుపై ఉత్కంఠ

సూర్యనారాయణ, వాణిజ్య పన్నులశాఖ సర్వీసెస్ అసోషియేషన్ అధ్యక్షుడు:
ఈ కేసు ఏ ఏజన్సీ విచారణ చేస్తోందో తెలియదు. సీఎస్ మౌనంగా వుంటారా? సీఎస్.. మీరు దొంగిలించిన మా జీపీఎఫ్ డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు మేం పోరాటం చేస్తూనే ఉంటాం. వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులారా మీరు భయపడొద్దు. మా ఉద్యోగులను ఎత్తుకపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. రేపు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం. అరెస్టులు చేసేందుకు కులాలు చూస్తారా? నేను కట్టుబడి ఉన్నా ఈ కామెంట్ కు. ఈ కేసులో పేర్లు ఉన్న ఉన్నతాధికారులపై చర్యలు లేవు.(Andhra Pradesh)