YS Viveka case: ఆ సత్తా టీడీపీకి ఉంది.. వెన్నతో పెట్టిన విద్య: సజ్జల రామకృష్ణారెడ్డి

జడ్జిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం నీచమైన చర్య అని సజ్జల అన్నారు.

YS Viveka case: ఆ సత్తా టీడీపీకి ఉంది.. వెన్నతో పెట్టిన విద్య: సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy

YS Viveka case – Sajjala: టీడీపీ (TDP) నేతలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుంటూరు జిల్లా (Guntur) తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా కేసులో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు.

” న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా టీడీపీ వ్యవహరిస్తోంది. 2024 ఎన్నికల కోసం సునీతను చంద్రబాబు పక్కన పెట్టేస్తారు. సీబీఐని మేనేజ్ చేయగల సత్తా టీడీపీది. బ్రోకరేజ్ చేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. కొందరు కేసును తప్పుదోవ‌పట్టిస్తున్నారు. జగన్ ను ఎదుర్కొనే సత్తాలేని టీడీపీ ఇటువంటి వాటికి పాల్పడుతోంది.

జడ్జిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం నీచమైన చర్య. పరిస్థితి ఏ స్థాయికే దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలను మేనేజ్ చేయడం టీడీపీకి బాగా తెలుసు.. కుట్రలు ప్రజలకు తెలుసు. వివేకానందరెడ్డి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు. వైఎస్సార్ కు లక్ష్మణుడి మాదిరిగా వివేకా ఉండేవారు.

వివేకా హత్య కేసు ఆరోణపలు ఇటువైపే తిప్పడం దారుణం. వివేకా బలహీనతలు, హత్యకు కారణాలు ఏవేవో ఉన్నాయి.. ఇవి బయట డిస్కర్షన్ చేయడానికి ఇబ్బంది ఉన్నా మీడియాలో కొన్ని ఛానళ్లు తప్పుగా చూపిస్తున్నాయి. జడ్జి ప్రశ్నించారనే ఆయనపై డబ్బులు ముట్టాయనే విధంగా కామెంట్ చేసే విధంగా ఎదిగారు.

వివేకా‌ కేసులో ఇంకో కోణం ఉంది.. ఆ కోణంలో విచారించమని అడుగుతూనే ఉన్నాం. అయినా మా‌ మాటలను పెడచెవిన పెడుతున్నారు. అవినాశ్ ను అరెస్టు చేయడమనే అంశం వేధించేందుకేనని అర్థమవుతోంది. వివేకా కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి మళ్లీ వైసీపీలోకి వచ్చారు.. ఆ విషయం అందరికీ తెలుసు.

టీడీపీ నడిపిస్తున్న స్కెచ్.. జగన్ ను ధైర్యంగా ఎదుర్కోలేక సీబీ మరికొంతమందితో ఇంతవరకు లాక్కొచ్చింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్ర‌ ఉన్నట్లు ఆధారాలు లేవు. వివేకా అల్లుడి విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? సీబీఐకి ఏ లైన్లో వెళ్లాలని చెప్పారో ఆ లైన్ లోనే వెళుతోంది” అని సజ్జల ఆరోపించారు.

YS Viveka Case : ఎంపీ అవినాశ్ రెడ్డికి బెయిల్ .. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న సీబీఐ