Somuveerraju On Jagan
Somuveerraju : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 17వ తేదీన ఏపీలో పర్యటించనున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు చెప్పారు. 51 ప్రాజెక్టుల్లో 21 జాతీయ రహదారులు ప్రారంభిస్తారని తెలిపారు. 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారని వెల్లడించారు. వీటికి రూ.21,50,058 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. రూ. 64వేల కోట్లు ప్రాజెక్టులు ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని పార్లమెంటు సాక్షిగా చెప్పారని తెలిపారు. 25వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను విస్తరించనున్నారని సోమువీర్రాజు చెప్పారు. ఇందులో అధిక ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడిగి తీసుకోవాలన్నారు.
Realme C35 Phone : రూ.13 వేలకే రియల్‌మీ కొత్త ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా..!
విశాఖ, రాజమండ్రి, లంబసింగిలను కలుపుతూ అభివృద్ధి చేస్తారని అన్నారు. రూ.689 కోట్లతో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటకం, రోడ్లు అభివృద్ధి చేస్తారని చెప్పారు. జాతీయ రహదారి నిర్మాణాలకు పునరావాసం, బాధితులకు నష్ట పరిహారం ఇస్తున్నాం అని సోమువీర్రాజు వెల్లడించారు. దేవరపల్లి, కొవ్వూరు సెక్షన్ కి రూ.2676 కోట్లు.. రూ.4,793 కోట్లతో రాజమండ్రి, విశాఖవైపు మరో రహదారి నిర్మాణం చేపడతామన్నారు. ఇలా ఏపీలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు.
Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?
హైదరాబాద్ లో నేచర్ క్యూర్ హాస్పటల్ ఉందని.. అలాగే 25 ఎకరాలు కేటాయించి ఏపీలో నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. సామర్లకోటలో సెంట్రల్ ప్లాంటేషన్ కార్పొరేషన్ నిర్మాణానికి గతంలో అడిగారని చెప్పారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకున్నారని సోమువీర్రాజు చెప్పారు. జగన్ ప్రభుత్వం.. అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేంద్రం ఆమోదం తెలిపాక ఇచ్చిన స్థలాలని వెనక్కి తీసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని సోమువీర్రాజు చెప్పారు. కేంద్రం ప్రాజెక్టులు పెడతామన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు.