Realme C35 Phone : రూ.13 వేలకే రియల్‌మీ కొత్త ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా..!

Realme C35 స్మార్ట్ ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కేవలం రూ.10వేల ధరకే ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Realme C25 మోడల్ ఫోన్ కు ఇది అప్ గ్రేడ్ వెర్షన్..

Realme C35 Phone : రూ.13 వేలకే రియల్‌మీ కొత్త ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా..!

Realme C35 With 50 Megapixe

Realme C35 Phone : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అదే.. Realme C35 స్మార్ట్ ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కేవలం రూ.10వేల ధరకే ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Realme C25 మోడల్ ఫోన్ కు ఇది అప్ గ్రేడ్ వెర్షన్.. సరికొత్త డిజైన్ తో అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను మరింత ఆకట్టుకునేలా ఉంది.

Realme C35 మోడల్ డిజైన్ కొత్తది కాదు.. Realme GT 2 సిరీస్ మాదిరిగా ఉంటుంది. C-సిరీస్ కు మాత్రం కొత్త మోడల్.. రెండు పెద్ద కెమెరాలతో పాటు యూజర్లను అట్రాక్ట్ చేసేలా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ముందుగా ఈ కొత్త Realme C35 స్మార్ట్ ఫోన్ థాయిలాండ్ మార్కెట్లో లాంచ్ అయింది.

భారత్ సహా ఇతర దేశాల మార్కెట్లోకి ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది Realme కంపెనీ వెల్లడించలేదు. భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. Realme ఇప్పటికే భారత్‌లో 2022 లాంచ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది.

Realme C35 ధర ఎంతంటే? :
Realme C35 THB 5,799 నుంచి ప్రారంభమవుతుంది. భారత కరెన్సీలో ధర రూ. 13,300 వరకు ఉంటుంది. ఈ ఫోన్ గ్లోయింగ్ గ్రీన్, గ్లోయింగ్ బ్లాక్ కలర్స్‌లో వస్తుంది.

Realme C35 స్పెసిఫికేషన్స్ :
Realme C35 ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. ఇదో ఎంట్రీ-లెవల్ ఫోన్. ఫోన్ 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేతో స్క్రీన్-టు-బాడీ రేషియో 90.7 శాతం, పిక్సెల్ డెన్సిటీ 401 PPIతో వస్తుంది. Realme C35 పవర్ ARM Mali-G57 GPUతో ఆక్టా-కోర్ 2.0GHz Unisoc T616 ప్రాసెసర్‌తో రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది. 4GB RAM, 64GB స్టోరేజీ, 6GB RAM 128GB స్టోరేజీతో వచ్చింది. మైక్రో SD కార్డ్‌ ద్వారా 1TB వరకు స్టోరేజీని ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. Android 11-ఆధారిత Realme UIR ఎడిషన్‌ ద్వారా రన్ అవుతుంది.

Realme C35 వెనుక భాగంలో 1080p వీడియో రికార్డింగ్‌తో 50-MP మెయిన్ కెమెరా, మాక్రో కెమెరా, పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ, బ్లాక్ అండ్ వైట్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం.. ఫోన్‌లో వాటర్-డ్రాప్ నాచ్ 8-MP కెమెరా ఉంది. Realme C35 ఫోన్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో రన్ అవుతుంది.


ఛార్జింగ్ USB-C పోర్ట్‌ను కలిగి ఉంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ అమర్చారు. Wi-Fi, బ్లూటూత్, GPS, 4G LTE కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. లైట్ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్, మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ ఉన్నాయి. అలాగే 8.1mm మందంగానూ 189 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లోనూ ఇక వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.. కమింగ్ సూన్..!