sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?

అధికసమయం నిద్రపోయేవారు ఊబకాయం, అధికబరువుతోపాటు అలసట వంటి సమస్యలకు లోనవుతారు. అలాంటి వారిలో గుండె సమస్యలు ఎదురవుతాయి.

sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?

Over Sleep

sleep : నిద్ర లేమి కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని అందరికి తెలిసిందే.. మధుమేహం, గుండె నాళాలకు సంబంధించిన జబ్బులు, స్థూలకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం అతి నిద్ర వల్ల కూడా ఆరోగ్యానికి హాని జరుగుతుందని ఆధ్యయనాలు చెబుతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితం లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే మరికొంత మంది మాత్రం అదేపనిగా నిద్రపోతూ గడిపేస్తున్నారు. ఆరోగ్యవంతమైన మనుషులకు ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ నిద్ర అవసరం. అంతకు మించి నిద్ర పోతే ఆరోగ్యపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధిక సమయం నిద్రించే వారు చాలా అరుదుగానే ఉంటారు. అయితే అలాంటి వారు అధిక సమయం నిద్రకే కేటాయిస్తే చాలా సమస్యలను ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా నిద్రపోయేవారిని ఎదుటివారు సోమరులుగా చూసే అవకాశం ఉంటుంది. అధికసమయం నిద్రపోతుంటే మాత్రం శరీరంలో ఆరోగ్య రుగ్మతలు ఉన్నాయేమో ఒకసారి వైద్యులకు చూపించటం మంచిది.

అధికసమయం నిద్రపోయేవారు ఊబకాయం, అధికబరువుతోపాటు అలసట వంటి సమస్యలకు లోనవుతారు. అలాంటి వారిలో గుండె సమస్యలు ఎదురవుతాయి. తద్వారా అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉన్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రోజుకు పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వారు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం, అకాల మరణానికి లోనయ్యే ప్రమాదం 41 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

ఎక్కవ సమయం నిద్రపోవటం వల్ల తలనొప్పి, డిప్రెషన్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నట్లు హెల్త్ నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో నిద్రించి తిరిగి పగటి సమయంలో కూడా నిద్రిస్తే మాత్రం తెలియని సమస్య మిమ్మల్ని వెంటాడుతున్నట్లు గుర్తించాలి. ఎక్కవ సమయం నిద్రతో గడపటం వల్ల ఏకాగ్రత దగ్గుతుంది. ఏపనిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టలేరు. ఎక్కవ సమయం నిద్రపోయే వారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

అధిక సమయ నిద్రిస్తే రోజు వారి కార్యకలాపాలకు విఘాతం కలుగుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో రాత్రిళ్లు నిద్రలేమి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. మగవారి కంటే స్త్రీలు అధికసమయం నిద్రపోతుంటారు. అలాంటి వారికి గుండె సమస్యలు అధికంగా వస్తాయి. అదే సమయంలో ఊబకాయంతో బాధపడుతున్న వారు అధిక సమయం నిద్రతో గడిపేస్తుంటారు. అధిక బరువు సైతం అతి నిద్రకు దారితీసే అవకాశాలు కల్పిస్తుంది.

అధికంగా నిద్రపోతున్నవారు దాని నుండి బయటపడాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే యోగా, వ్యాయామాలు సాధ చేయాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో చురుకుదనం ఏర్పడుతుంది. బద్ధకం వదిలిపోతుంది. తద్వారా రోజు వారి కార్యకలాపాల్లో యాక్టీవ్ గా ఉంటారు. రాత్రిళ్లు మాత్రమే బెడ్ పై ఉండేలా అలవాటు చేసుకోవాలి. ఎక్కవగా శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. గంటల తరబడి నిద్రపోకుండా ఉండేందుకు బెడ్ పక్కనే అలారం పెట్టుకుని సమయానుగుణంగా మేల్కొనేలా అలవర్చుకోవాలి. ఇలా చేస్తే అతినిద్ర సమస్య నుండి బయటపడవచ్చు.