Speaker Tammineni Hot Comments On Chandrabbau
Tammineni Sitaram : చంద్రబాబు ‘జూమ్’ వదిలి జనంలోకి రావాలని ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే జుగుప్సాకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. కలుగులో ఎలుకలా చంద్రబాబు జూమ్‌లో ఎందుకు బయటకు వచ్చి జనానానికి భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు.
బయటకు వస్తే కరోనా వచ్చి ప్రాణాలు పోతాయని భయమా…. నీది నీ కొడుకువేనా ప్రాణాలు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఉద్యోగాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని… జాబు కావాలంటే బాబు రావాలన్నారు… అధికారంలో ఉండగా ఎంత మందికి ఉద్యోగాలిచ్చారని తమ్మినేని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కాలెండర్ గురించి టీడీపీ నాయకులకు విమర్శించే అర్హత లేదని ఆయన అన్నారు. ఈ సారి వచ్చేది నిశ్సబ్ద విప్లవమే అని ఈ సారి ఎన్నికల్లో 151 కాదు మొత్తం సీట్లు స్వీప్ చేస్తామని తమ్మినేని సీతారాం ధీమా వ్యక్తం చేశారు.