Sri Krishnadevaraya University: ఒకే నెలలో ఐదుగురు చనిపోయారు.. అందుకే హోమం చేస్తున్నాం

Sri Krishnadevaraya University Homam: ఎస్కేయూ వీసీ అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తలపెట్టిన మహా మృత్యుంజయ శాంతిహోమంపై వివాదం రాజుకుంది.

Sri Krishnadevaraya University: ఒకే నెలలో ఐదుగురు చనిపోయారు.. అందుకే హోమం చేస్తున్నాం

Updated On : February 20, 2023 / 2:23 PM IST

Sri Krishnadevaraya University Homam: ఎస్కేయూ వీసీ అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తలపెట్టిన మహా మృత్యుంజయ శాంతిహోమంపై వివాదం రాజుకుంది. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ నిధులు ఖర్చు చేస్తున్నారని పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. పాఠాలు బోధించాల్సిన వర్సిటీలో హోమంపై ప్రగతిశీలవాదులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైస్ చాన్స్ లర్ కృష్ణారెడ్డి స్పందించారు. మృత్యుంజయ శాంతిహోమానికి యూనివర్సిటీ నిధులు వెచ్చించడం లేదని, సిబ్బంది స్వచ్ఛందంగా ఇచ్చిన డబ్బుతోనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

మా కళ్ల ముందే ముగ్గురు మృతి
ఒక నెలలోనే 5 మంది ఉద్యోగులు మృతి చెందడంతో యూనిర్సిటీలో మృత్యుంజయ శాంతిహోమం చేయాలని నిర్ణయించాం. యూనివర్సిటీలో పాఠాలు చెబుతూ మా కళ్ల ముందే ముగ్గురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 24 తేదిన యూనివర్సిటీలో మృత్యుంజ హోమం ఉదయం 8.30 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనికి టీచింగ్ సిబ్బంది రూ.500, నాన్ టీచింగ్ స్టాఫ్ రూ.100 చొప్పున ఇవ్వాలని భావించాం. స్వచ్ఛందంగానే నిధులు వసూలు చేశాం. ఎవరినీ బలవంతం చేయలేదు.

Also Read: ఏపీ ఎస్ఐ ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్ష కీ విడుదల.. 2 వారాల్లో పరీక్షా ఫలితాలు!

మహా మృత్యుంజయ శాంతిహోమానికి యూనివర్సిటీ నిధులు ఉపయోగించడం లేదు. ఉద్యోగుల వెల్ఫేర్ కోసమే ఈ మృత్యుంజ హోమం చేస్థున్నాం. మృత్యుంజయ హోమానికి రాజకీయాలకు సంబంధం లేదు. హోమంలో యూనివర్సిటీకి సంబందించిన వారు మాత్రమే పాల్గొంటారు. బయటి వారు ఎవరూ రారు. ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఎస్కేయూ వీసీ కృష్ణారెడ్డి వివరించారు.