AP SI Recruitment : ఏపీ ఎస్ఐ ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్ష కీ విడుదల.. 2 వారాల్లో పరీక్షా ఫలితాలు!

APలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ప్రిలిమినరీ టెస్టులో అర్హత సాధించిన వారు సోమవారం సాయంత్రం 5గంటల లోపు చేసుకోగలరు.

AP SI Recruitment : ఏపీ ఎస్ఐ ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్ష కీ విడుదల.. 2 వారాల్లో పరీక్షా ఫలితాలు!

AP Police SI preliminary answer key released at slprb.ap.gov .

AP SI Recruitment : ఏపిలో 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ పోలీసు నియామక బోర్డు (apslprb) రాష్ట్రవ్యాప్తంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 1,51,243మంది అభ్యర్థులు హాజరైనట్టు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా  291 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

అభ్యర్థులు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 23 ఉదయం 11గంటల లోపుగా SCTS- iness PWT@slprb. appolice. gov. తెలియజేయాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ కాపీలతో పాటు, ఫలితాలను రెండు వారాల్లో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఏపిలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ప్రిలిమినరీ టెస్టులో అర్హత సాధించిన వారు సోమవారం సాయంత్రం 5గంటల లోపు చేసుకోగలరు. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 లైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. దీనిలో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ అర్హత సాధిస్తారు.