Ysrcp
నెల్లూరు జిల్లా.. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న డిస్ట్రిక్. పార్టీ పెట్టినప్పటి నుంచి సింహపురిలో వైసీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. జగన్‌తో పాటు తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి పోటీ చేసి వైసీపీ గుర్తు మీద తొలిసారి విజయ భేరీ మోగించారు.
ఇక 2014లో నెల్లూరులో మూడు సీట్లు తప్ప అన్నీ గెలుచుకుంది వైసీపీ. 2019లో పదికి పది సీట్లను గెలిచింది. ఇలా వైసీపీకి నెల్లూరు పెద్ద దిక్కుగా ఉంది. కొండంత అండగా నిలబడి రాజకీయాన్ని పీక్స్‌కు చేర్చింది. అయితే అదే నెల్లూరు..వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం వర్గపోరుతో బలహీనపడుతూ వచ్చింది. అధినాయకత్వం సరైన సమయంలో పట్టించుకోకపోవడంతో ఫ్యాన్ స్పీడ్ బాగా తగ్గింది.
ఇక 2024 చూస్తే మొత్తానికి మొత్తం పది సీట్లనూ ఒక ఎంపీ సీటును కూడా కూటమి కైవసం చేసుకుంది. ఆ విధంగా ఫ్యాన్‌ను పొలిటికల్‌గా స్విచ్చాఫ్ చేసేసింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచి వైసీపీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, అలాగే 2019లో పార్టీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి లాంటి వారు పార్టీని వీడటం వైసీపీకి చాలా డ్యామేజ్ చేసింది.
ఈ నేతలు అందరూ అంతే..
సీనియర్ నేతలను కాదని.. మూడేళ్ల పాటు మంత్రి పదవి ఇస్తే అనిల్ కుమార్ యాదవ్ సత్తా చాటలేకపోయారు. ఆయన.. రాజకీయం అనుభవం ఉన్న నేతలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలకు పోవడంతోనే.. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం వైసీపీకి దూరం అయిందన్న చర్చ ఉంది. కాకాణి గోవర్ధనరెడ్డికి చివరి రెండేళ్ళు మంత్రి పదవి ఇచ్చినా ఫలితం లేకపోయింది.
ఇక సీనియర్ నేతగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి పదవి దక్కనందుకు కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో ఆయనను వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి కోవూరులో ఓడించారు. దాంతో ఆయన కూడా రాజకీయంగా అంత చురుకుగా లేరు. ఇప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది.
దాంతో గ్రౌండ్ లెవల్ రియాల్టీస్‌పై వైఎస్ జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారట. నెల్లూరులో వైసీపీకి కంచుకోటలు ఎలా కూలిపోయాయి.? మొదటి నుంచి బలం తక్కువగా ఉన్న టీడీపీ ఎలా స్వీప్ చేసింది అన్నది లోతుగా వెళ్తేనే తప్ప అర్ధం కాదంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్.
జగన్ వేసిన స్కెచ్ రివర్స్?
రాజకీయంగా పలువురు సీనియర్ నేతల ప్రభావం తగ్గించడం కోసం.. జగన్ వేసిన స్కెచ్ రివర్స్ అయిందన్న చర్చ జరుగుతోంది. తనకు నచ్చిన వారిని ఎమ్మెల్యేలుగా చేయడం..వారికి మినిస్ట్రీలు ఇవ్వడం సీనియర్లకు నచ్చలేదని..అందుకే వాళ్లు పార్టీని వదిలి వెళ్లారంటున్నారు వైసీపీ కార్యకర్తలు.
పర్టిక్యులర్‌గా ఒక సామాజికవర్గానికి చెందిన నేతలను చిన్నచూపు చూడటం వల్లే నెల్లూరులో వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అధినేత జగన్ నిర్ణయాలు పార్టీకి డ్యామేజ్ చేశాయని క్యాడర్ ఓపెన్‌గానే చెప్తున్నారు. నమ్మిన నేతలు పార్టీని నిలబెట్టలేదని..జగన్ విశ్వసించని లీడర్లు టీడీపీలోకి వెళ్లిపోయారని అంటున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. రాబోయే రోజుల్లో వైసీపీ బౌన్స్ బ్యాక్ అవుతుందా..? అందుకోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది వేచి చూడాలి మరి.
కూటమి పార్టీల వైపు ఫ్యాన్ పార్టీ నేతల చూపు.. చేర్చుకుంటే ఓ ఇబ్బంది, చేర్చుకోకపోతే మరొకటి..