×
Ad

Sundar Pichai: విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు..

ఇందుకోసం వైజాగ్ లో 15 బిలియన్ డాలర్లతో ఒక గిగా వాట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్, ఏఐ హబ్ పెడుతున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.

Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వైజాగ్ ప్రత్యేకతను చాటేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రీమ్ ఫోర్స్ అనే సేల్స్ ఫోర్స్ వార్షిక టెక్నాలజీ ఈవెంట్ లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా గూగుల్ పెట్టుబడులపై సేల్స్ ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్ ప్రస్తావించారు. గూగుల్ తన అత్యధిక పెట్టుబడి దక్షిణ భారత దేశంలో పెట్టాలని నిర్ణయించిందన్నారు.

ఇందుకోసం వైజాగ్ లో 15 బిలియన్ డాలర్లతో ఒక గిగా వాట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్, ఏఐ హబ్ పెడుతున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. వైజాగ్ ఒక బ్యూటిఫుల్ కోస్టల్ టౌన్ అంటూ అభివర్ణించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తో ఆ ప్రాంతం ముఖచిత్రమే మారిపోనుందని సుందర్ పిచాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తాను చిన్నప్పుడు భారత దేశంలో రైలు ప్రయాణం చేసే సమయంలో కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న గూగుల్ సీఈవో.. వైజాగ్ అందాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. విశాఖ గురించి ఆయన మాట్లాడిన ఈ వీడియో ఆన్ లైన్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ వారంలో వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై సుందర్ పిచాయ్ రెండుసార్లు స్పందించారు.

ఈ నెల 14న ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న వెంటనే.. ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. విశాఖ గూగుల్ ఏఐ హబ్ కోసం తాను ప్రధాని మోదీతో మాట్లాడినట్లు చెప్పిన సుందర్ పిచాయ్.. ఏపీ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని చరిత్రాత్మక అభివృద్ధిగా చెప్పుకొచ్చారు.

Also Read: గూగుల్ డేటా సెంటర్‌ చుట్టూ రాజకీయం..! ఎందుకీ వివాదం? వైసీపీ వాదన ఏంటి?