Chandrababu Petition : చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లాలని సూచన, ప్రతివాదులకు నోటీసులు జారీ

సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టుకు సమర్పించిన పత్రాలన్నీ సుప్రీంకోర్టుకు ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది.

Chandrababu Petition (1)

Chandrababu Petition – Supreme Court : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టుకు సమర్పించిన పత్రాలన్నీ సుప్రీంకోర్టుకు ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది.

చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళాలని సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణ సమయానికి హైకోర్టులో సమర్పించిన అన్ని డాక్యుమెంట్లు తమ ముందు ఉంచాలని తెలిపింది.

Murali Mohan : చంద్రబాబు అరెస్టుపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇరు వర్గాల వాదనలు కొనసాగాయి. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తదుపరి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 2015-16లో నేరం జరిగింది కదా ? అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. 2018లో అవినీతి నిరోధక చట్టంలో 17-a రాకముందే నేరం జరిగింది కదా అని ప్రశ్నించారు. ఐపీసీ కింద నమోదైన నేరాల పరిస్థితి ఏమిటని నిలదీశారు. పీసీ యాక్ట్ తో పాటు ఐపీసీ కింద కూడా నేరాలు నమోదయ్యాయి కదా అని అన్నారు. తాము కేసు మెరిట్స్ లోకి వెళ్ళడం లేదన్నారు.

Pawan Kalyan : పెడనలో నాపై రాళ్లదాడి చేస్తారని సమాచారం, నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. చంద్రబాబు అరెస్ట్ లో అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ పాటించలేదన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని తెలిపారు. ఇది క్యాబినెట్ నిర్ణయని, అధికార విధులలో భాగమేనని స్పష్టం చేశారు.

సీఐడీ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. చంద్రబాబు పిటిషన్ ను తిరస్కరించాలని ముకుల్ రోహత్గి తెలిపారు. జూలై 2018లో 17-A వచ్చిందని కానీ అంతకంటే ముందే ఈ కేసు విచారణ ప్రారంభమైందన్నారు. 2017లోనే సీబీఐ ఈ కేసుపై ఎంక్వైరీ చేయమందని తెలిపారు.