Murali Mohan : చంద్రబాబు అరెస్టుపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని అన్నారు. హైటెక్ సిటీ వచ్చింది అంటే ఆది చంద్రబాబు వల్లనేనని స్పష్టం చేశారు.

Murali Mohan : చంద్రబాబు అరెస్టుపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు

Murali Mohan

Updated On : October 2, 2023 / 2:08 PM IST

Murali Mohan – Chandrababu Arrest : ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ను అరెస్టు చేయటం అన్యాయం అన్నారు. సూర్యునిపై ఉమ్మేస్తే ఉమ్మేసిన వాళ్లపైనే తిరిగి పడుతుందన్నారు. ఉదయించే సూర్యున్ని అడ్డుకోవడానికి చేతులు పెట్టడం మూర్ఖత్వం అవుతుందని చెప్పారు.

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని అన్నారు. హైటెక్ సిటీ వచ్చింది అంటే ఆది చంద్రబాబు వల్లనేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఐటీ డెవలప్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

Ambati Rambabu : చంద్రబాబు నిరాహార దీక్ష చూసి గాంధీజీ ఆత్మ క్షోభిస్తుంది : మంత్రి అంబటి

చంద్రబాబు బిల్ గేట్స్ తో మాట్లాడి ఆయనను హైదరాబాద్ కి రప్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు విజన్ 2020 వల్లనే అభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు విజన్ 2040 ప్రకటించారని తెలిపారు.