JC Prabhakar Reddy
Tadipatri Muncipal Chairman JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల కోసం ఎస్పీలు పనిచేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ఒక కాంపౌండ్ వాల్ కోసం ఇంత రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే నాకు గౌరవం. ఆయన వాస్తవాలు తెలుసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే ఏది చెబితే అది నిజం కాదు. తాడిపత్రిలో పరిస్థితులు ఒకసారి తెలుసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. జూనియర్ కళాశాల కాంపౌండ్ విషయంలో నేను పోరాడుతున్నది నాకోసం కాదు. తాడిపత్రిలో రోడ్ల కోసం.. అక్కడి ప్రజల సౌకర్యాల కోసం అని ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
ఒక్క ఎమ్మెల్యే చెప్పింది చేయడానికి మొత్తం పోలీస్ బలగమంతా దిగింది. మూడు రోజులు పోలీసులుకైన ఖర్చు రూ. 25లక్షలు. ఇదే డబ్బుతో జూనియర్ కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మించి ఉండవచ్చు. ఎమ్మెల్యేకి కాపు కాయడానికి ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ పని చేస్తోంది. మండలానికి ఒక గూండాని పెట్టుకొని కప్పం కడితే సరిపోతుంది. జిల్లా ఎస్పీ నన్ను ఏం చేస్తారు..? ఇప్పటికే నాకు చేయాల్సిందంతా చేశారు. నా మీద కేసులు పెట్టారు. పీడీ యాక్ట్ పెడుతున్నారు. నేను బతికి ఉండగా నా మీద ఉన్న కేసులు పూర్తికావు అంటూ జేసీ అన్నారు. తాడిపత్రి డీఎస్పికి మొదటి నుంచి మా ఫ్యామిలీ అంటే పడదని జేపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
JC Prabhakar Reddy : ప్రహరిగోడ కట్టలేని ఎమ్మెల్యే తాడిపత్రికి ఏం చేస్తాడు? : జేసి ప్రభాకర్ రెడ్డి
డీఎస్పీ గంగయ్య మమ్మల్ని ఏం చేస్తాడు? ఇసుక అక్రమ రవాణా ఎందుకు ఆపలేదు? నీకు ఏ నాయకుడు ఎంత చేస్తున్నాడో మొత్తం బయట పెడతా అంటూ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. గతంలో డీఎస్పీ చైతన్య పై 12 కేసులు పెట్టాము. డీఎస్పీ, సీఐలకు భయపడేది లేదంటూ జేసీ అన్నారు. ఎవరికీ భయపడేది లేదు. ఇసుకను బంద్ చేయండి .. లేకుంటే ఏమి అవుతోందో చూడండి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.