JC Prabhakar Reddy : ప్రహరిగోడ కట్టలేని ఎమ్మెల్యే తాడిపత్రికి ఏం చేస్తాడు? : జేసి ప్రభాకర్ రెడ్డి

ప్రహరీగోడ కట్టలేనివాడు తాడిపత్రికి ఏచేస్తాడు...?మీ పార్టీకి అధికారం ఇంకా ఎనిమిది నెలులు ఉంది అనుకుంటున్నావేమో..కానీ ఈలోపే నిన్ను ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయని ఆ రోజులు దగ్గరపడ్డాయి.

JC Prabhakar Reddy : ప్రహరిగోడ కట్టలేని ఎమ్మెల్యే తాడిపత్రికి ఏం చేస్తాడు? : జేసి ప్రభాకర్ రెడ్డి

jc prabhakar reddy

jc prabhakar reddy : టీడీపీ నేత జేసి ప్రభాకర్ రెడ్డి (jc prabhakar reddy)మరోసారి తనదైన శైలిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి(Pedda Reddy)పై విరుచుకుపడ్డారు. తాడిపత్రి అంటే ఒక ఊరు మాత్రమే కాదు అది నా నియోజక వర్గం నా ఇల్లు నా కుటుంబం అంతా తాడిపత్రే..అటువంటి తాడిపత్రికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏం చేశారు? అంటూ ప్రశ్నించారు. భూ కబ్జాలు చేయటం తప్ప ఏం చేస్తాడు..? అని ప్రశ్నించాడు. తండ్రి విగ్రహానికి ప్రహరీగోడ కట్టలేనివాడు తాడిపత్రికి ఏచేస్తాడు…?అంటూ సెటైర్లు వేశారు. మీ పార్టీకి అధికారం ఇంకా ఎనిమిది నెలులు ఉంది అనుకుంటున్నావేమో..కానీ ఈలోపే నిన్ను ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయని ఆ రోజులు దగ్గరపడ్డాయి అంటూ మండిపడ్డారు.

తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy)భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. తాడిపత్రిలో రూ.2 కోట్ల రూపాయలు విలువ చెసే మున్సిపాలిటి స్థలంలో అక్రమంగా ట్రాఫిక్ పోలీస్టేషన్ నిర్మిస్తున్నారని ఇటువంటి అక్రమాలకు పాల్పడే పార్టీ అధికారంలో ఉందని విర్రవీగుతున్నారు..ఇంకా మీకు అధికారం ఎనిమిది నెలలు ఉందని అనుకున్నారు..కానీ మీరు చేసే అక్రమాలకు చరమగీతం పాడి ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి అంటూ విమర్శించారు. ఎమ్మెల్యే తండ్రి విగ్రహాని ప్రహరిగోడ కట్టలేని వాడు తాడిపత్రికీ ఏం చేస్తాడు..?అంటూ ఎద్దేవా చేశారు. తాడిపత్రి నియోజక వర్గంలో ఇసుకను అక్రమంగా దోపిడి చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్టీకి తొత్తులుగా మారి ఇటువంటి అక్రమాలను అధికారులు పట్టించుకోవటంలేదని మండిపడ్డారు.

YV Subba Reddy : వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. వైవీ సుబ్బారెడ్డి ముందే రెండు వర్గాల ఘర్షణ

వైసీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి మున్సిపాల్టీ నాశనమైందన్నారు. ఒకటిన్నర ఏడాదిలో తాడిపత్రి మరింతగా నాశమైందని ఎమ్మెల్యే ఎటువంటి పనులు చేయరు..తాము చేస్తామంటే చేయనివ్వరు ఇటువంటి నాయకులకు బుద్ధి చెప్పాలని అన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థంగా మారిందని.. పనులు ఎమ్మెల్యే పనులు చేస్తానంటే స్వాగతిస్తామని ఆయనే పనులు చేస్తానంటే తాను రాజీనామా చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు తాడిపత్రి మన్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.

తాడిపత్రిలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేస్తే స్పందన కార్యక్రమంలో ఎటువంటి స్పందన ఉండదు అంటూ ఎద్దేవా చేశారు. అధికారులకు టన్నుల కొద్దీ పేపర్ల రూపంలో ఫిర్యాదులు చేశాం
కానీ ఎటువంటి స్పందనా లేదన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను ప్రజలు ఉతికేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అధికారులు ఇంత సిగ్గులేకుండా ఎందుకు ఉండగలుతున్నారు…? అంటూ ప్రశ్నించారు.

సమస్యలపై తాము మాట్లాడితే హౌస్ అరెస్టులు చేస్తారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు అంటూ మండిపడ్డారు. ఇక కేసులకు భయపడేది లేదన్నారు.  అక్రమాలపై నిగ్గు తేల్చండి.. లేకపోతే దానికి అనుమతులు చూపించండీ అంటూ డిమాండ్ చేశారు.ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకోకుంటే అక్కడే వంటా వార్పు కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. వైసీపీ చేసే దౌర్జన్యాలనుంచి తమ కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. మాకు పదవులు అవసరం లేదు..కార్యకర్తలు క్షేమంగా ఉండటమే కావాలన్నారు. దాని కోసం తాము కష్టపడతామన్నారు. ఇక వచ్చే ఎన్నికలకు ముందే అధికార పార్టీ నేతలకు..వారికి కొమ్ముకాస్తున్న అధికారులకు తగిన శాస్తి తప్పదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.