తమిళనాడు అటవీ అధికారుల అతితెలివి.. చిరుత పులిని ఏం చేశారంటే..

తమిళినాడు అటవీశాఖ అధికారులు చిరుత పులిని బంధించడం వరకు బాగానే ఉన్నా.. ఆ చిరుతను ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టి ..

Leopard Operation : తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. తొమ్మిది గంటలపాటు శ్రమించి అటవీ సిబ్బంది చిరుతను పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి కారు షెడ్డులో ఇరుక్కుపోయిన చిరుత పులికి మత్తు మందు ఇచ్చి బంధించారు. అటవీ అధికారులకు పట్టుబడింది మగ చిరుత. దీని వయస్సు సుమారు నాలుగేళ్లు ఉంటుందని తెలిపారు. బోనులో బంధించిన చిరుతను సమీప అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. చిరుత పులి దాడిలో తీవ్రంగా గాయపడిన వాచ్ మెన్ రాజగోపాల్ ను మెరుగైన వైద్యంకోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read: జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం..

తమిళినాడు అటవీశాఖ అధికారులు చిరుత పులిని బంధించడం వరకు బాగానే ఉన్నా.. ఆ చిరుతను ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టి కొత్త వివాదానికి తెరలేపారు. రామకుప్పం మండలం వీర్నమల అటవీ ప్రాంతంలో చిరుతను తమిళనాడు అటవీ అధికారులు వదిలిపెట్టారు. తమిళనాడు తిరుపత్తూరులో పట్టుకున్న చిరుతను కుప్పం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంపై చిత్తూరు జిల్లా అటవీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఐఏఎస్ అధికారి కృష్ణ తేజకు అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

కుప్పం అటవీ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చిరుతను వదిలిపెట్టిడం పట్ల తమిళనాడు ఫారెస్ట్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక.. చిరుతను కుప్పం దగ్గరల్లోనే వీర్నమల సమీపంలో వదిలిపెట్టడంతో స్థానికులు భాందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు