×
Ad

Attack On Ysrcp Office: హిందూపురంలో హైటెన్షన్.. వైసీపీ ఆఫీస్ పై దాడి.. ఫర్నీచర్ ధ్వంసం..

వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్చీచర్ ను ధ్వంసం చేశారు.

Attack On Ysrcp Office: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్చీచర్ ను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణపై హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు.

దీపిక భర్త వేణుగోపాల్ ఏమన్నారంటే..
”ఎవరో హైదరాబాద్ లో ఉండే వాళ్ల కింద బతుకుతున్నాం. హిందూపురంలో 40ఏళ్లుగా బానిసలుగా ఉన్నాం. అతడికి ఓట్లు వేస్తాం, అతడు ఎక్కడో కూర్చుంటాడు. మనం ఇక్కడ బానిస బతుకులు బతుకుతున్నాం. ఒక్కసారి హిందూపురం ప్రజలు ఆలోచన చేయండి. మనల్ని మనం పరిపాలించుకోవాలా? లేకపోతే ఎక్కడో ఉండే వ్యక్తుల కాళ్ల కింత బతకాలా? అన్నది మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి వైసీపీ ఇంఛార్జ్ దీపికను ఎమ్మెల్యేగా గెలిపించండి. హిందూపురంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా” అని దీపిక భర్త వేణుగోపాల్ అన్నారు.

ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. వేణుగోపాల్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. వైసీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తల దాడితో హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది.

Also Read: ఏపీలో CII సదస్సు.. మొత్తం పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లంటే.. చంద్రబాబు అధికారిక ప్రకటన