CII Summit: ఏపీలో CII సదస్సు.. మొత్తం పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లంటే.. చంద్రబాబు అధికారిక ప్రకటన

విశాఖలో సీఐఐ సదస్సు నుంచే సీఎం చంద్రబాబు వాటిని వర్చువల్ గా ప్రారంభించారు.

CII Summit: ఏపీలో CII సదస్సు.. మొత్తం పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లంటే.. చంద్రబాబు అధికారిక ప్రకటన

Updated On : November 15, 2025 / 4:58 PM IST

CII Summit: సీఐఐ సదస్సు ద్వారా ఏపీకి భారీగానే పెట్టుబడులు వచ్చాయి. CII సదస్సు ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గత 18నెలల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.22 లక్షల కోట్లకు చేరాయన్నారు. శ్రీసిటీలో మరికొన్ని యూనిట్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు కంపెనీలతో MoUలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 12వేల 365 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 2028 నాటికి శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏపీకి మూడు రేమాండ్ ప్రాజెక్టులు రాబోతున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు. విశాఖలో సీఐఐ సదస్సు నుంచే సీఎం చంద్రబాబు వాటిని వర్చువల్ గా ప్రారంభించారు. రాయలసీమకు స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ వస్తున్నాయని తెలిపారు. రాయలసీమలో బ్యాటరీ ఉత్పత్తి పరిశ్రమలు, రాప్తాడులో వస్త్ర పరిశ్రమ, అనంతపురం జిల్లా టేకులోడులో ఏరో స్పేస్ పరిశ్రమ వస్తుందని వివరించారు. ఈ పరిశ్రమల ద్వారా 20 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు.

విశాఖలో రెండు రోజుల పాటు సీఐఐ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ వేదికగా ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలి రోజు ఏకంగా 41 సంస్థలతో 8 లక్షల 26వేల 668 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా 4లక్షల 15వేల 890 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సదస్సు ప్రారంభానికి ముందు రోజు అంటే గురువారమే 35 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం.. 3 లక్షల 65వేల 304 కోట్ల పెట్టుబడులు రాబట్టింది.

Also Read: రూ.1.61 లక్షల కోట్లకు చేరిన దిగుమతుల బిల్లు.. వంటనూనె ధరలూ పెరిగిపోతే..