TDP Announces MLA Quota MLC Candidates
AP MLC Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10వ తేదీ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర కసరత్తు అనంతరం 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు.
బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు(బీసీ), కావలి గ్రీష్మ(ఎస్సీ) అవకాశం దక్కింది. సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.
ఎమ్మెల్సీ కోటాలో మొత్తం 5 స్థానాలు ఖాళీ అవ్వగా బీజేపీ, జనసేనకు చెరో సీటు దక్కింది. జనసేన తరపున నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా, మిగిలిన స్థానాల్లో మాత్రం ఎవరూ నామినేషన్ వేయలేదు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది.
ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. మూడు ప్రాంతాల్లో ఒక్కొక్కరిని ఎంపిక చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మళ్లీ ఎమ్మెల్సీగా చోటు దక్కింది.
Read Also : MLC Candidates: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్.. క్యాండెట్స్ వీరే..
అలాగే, బీదా రవిచంద్రకు ఎమ్మెల్సీ స్థానం దక్కింది. ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన కావలి గ్రీష్మకు టీడీపీ అవకాశం కల్పించింది. టీడీపీ ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించింది. మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేయనుంది. పిఠాపురం వర్మకు అవకాశం దక్కలేదు.
దువ్వారపు రామారావు, టీడీ జనార్దన్, పార్టీ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ మాల్యాద్రి, అశోక్ బాబు, మాజీ మంత్రి జవహర్‌కి అవకాశం దక్కలేదు. ఈసారి బీజేపీకి ఒక సీటు మాత్రమే దక్కింది. 2027లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఉంటే తప్పకుండా అవకాశం ఇస్తామని ఆశావహులకు సర్దిచెప్పినట్టు తెలిసింది.