MLC Candidates: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్‌ రిలీజ్‌.. క్యాండెట్స్‌ వీరే..

సీపీఐకి ఓ టికెట్ కేటాయించింది.

MLC Candidates: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్‌ రిలీజ్‌.. క్యాండెట్స్‌ వీరే..

Updated On : March 9, 2025 / 7:15 PM IST

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ కు టికెట్లు ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. సీపీఐకి ఓ టికెట్ కేటాయించింది.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించింది. ఢిల్లీ నుంచి ఫోనులో రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ సమాలోచనలు చేశారు.

Also Read: పసిడి కొంటున్నారా? ధరలు పెరుగుతుండడంతో మీ కోసం బంగారం వ్యాపారులు ఏం చేస్తున్నారో తెలుసా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలు సేకరించింది కాంగ్రెస్. చివరకు ఇవాళ అధికారికంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అభ్యర్థులను ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో సీపీఐ అభ్యర్థిని ఆ పార్టీ ఖరారు చేయనున్నారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ కార్యవర్గ సమావేశం జరుగుతోంది.

కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఇవాళ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశమై గంటన్నర పాటు చర్చించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో వారిద్దరు ఫోనులో మాట్లాడారు.

ఎస్సీల నుంచి అద్దంకి దయాకర్‌తో పాటు జ్ఞాన సుందర్, దొమ్మడి సాంబయ్య, రాచమల్లు సిద్దేశ్వర్ పేర్లు వినపడగా చివరకు అద్దంకి దయాకర్‌కే ఎమ్మెల్సీ టికెట్ దక్కింది.