Chandrababu Naidu : వినూత్న పద్ధతిలో సర్వే.. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఎలా సర్వే చేస్తాము అనేది ఎవరికీ చెప్పబోము అన్న చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో కొత్త పద్ధతిని పాటిస్తామన్నారు.

Chandrababu On Tickets Allocation

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల సీట్ల కేటాయింపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిప్రాయం ఆధారంగానే సీట్లు కేటాయిస్తామన్నారు చంద్రబాబు. వినూత్న పద్ధతిలో జనంలోకి వెళ్లి సర్వే చేస్తామని, దాని ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అయితే, ఎలా సర్వే చేస్తాము అనేది ఎవరికీ చెప్పబోము అన్న చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో కొత్త పద్ధతిని పాటిస్తామన్నారు.

టీడీపీలో టికెట్లు కన్ ఫర్మ్ అయిపోయాయి, కొన్ని నియోజకవర్గాలకు (10 -20) మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందని అందరూ భావించారు. ఈ క్రమంలో చంద్రబాబు ఒక బాంబు పేల్చారు. ప్రజాభిప్రాయం ద్వారానే టికెట్లు కేటాయిస్తానని చంద్రబాబు చెప్పడం సంచలనంగా మారింది. స్వయంగా తాను కూడా కుప్పంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుంటాను అని చంద్రబాబు చెప్పడం విశేషం. తన అభ్యర్థితత్వం పట్ల కుప్పం ప్రజలు సానుకూలంగా ఉన్నారా? లేదా? అన్నది తెలుసుకుంటాను అని చంద్రబాబు చెప్పారు. ప్రజాభిప్రాయసేకరణ చేస్తానని ప్రకటించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా టికెట్లు కేటాయిస్తామని, అభ్యర్థులను నిర్ణయిస్తామని చంద్రబాబు చెప్పారు.

Also Read : విశాఖపై పట్టు పెంచుకోడానికి వైసీపీ ప్రయత్నం.. వారిని కొనసాగిస్తారా, తప్పిస్తారా?

ఒకవైపు వైసీపీలో సీట్ల మార్పులు చేర్పుల గురించి చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఓ చోట చెల్లని కాసు.. మరో చోట ఎలా చెల్లుబాటు అవుతుంది? అని వైసీపీలో ఇంఛార్జిల మార్పులపై చంద్రబాబు కామెంట్ చేశారు. మరోవైపు టీడీపీలో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ముందుకెళ్తామన్నారు. సమాజంలో కావొచ్చు, ఏపీ రాజకీయాల్లో కావొచ్చు సమూల మార్పులు రావాలని చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగా టీడీపీ చాలా చొరవ తీసుకుంటుందని, ఈసారి మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తాము, కార్యకర్తలు కావొచ్చు నాయకులు కావొచ్చు ఎవరైతే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటారో వారే ఈసారి టీడీపీ అభ్యర్థులుగా ఉంటాచని చంద్రబాబు తేల్చి చెప్పారు.

అయితే, ఈ మెథడాలజీలో చంద్రబాబు సీక్రసీ పాటిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని ఎలా సేకరిస్తారు? అనేది మాత్రం చంద్రబాబు రివీల్ చేయలేదు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారా? ఫీల్డ్ సర్వే చేస్తారా? అనేది చంద్రబాబు చెప్పడం లేదు. అయితే, ప్రజాభిప్రాయ సేకరణ చాలా పారదర్శకంగా ఉంటుందని మాత్రం చంద్రబాబు చెబుతున్నారు. స్వయంగా నేనే ఈ అంశాలు అన్నింటిని పర్యవేక్షిస్తాను అని చంద్రబాబు చెప్పారు.

Also Read : బర్రెలక్కకి వచ్చిన ఓట్లు కూడా ప్యాకేజీ స్టార్‌కి రాలేదు: జగన్

ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? ప్రజాభిప్రాయాన్ని ఎవరు చూరగొంటున్నారు? ఎవరు మంచి అభ్యర్థి? ఇలాంటి అన్ని అంశాలను చంద్రబాబు స్వయంగా తెలుసుకుంటున్నారు. వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. తాము మాత్రం టీడీపీ అభ్యర్థుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, మంచి వారిని సెలెక్ట్ చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉండేవారిని, నిజాయితీపరులను అభ్యర్థులుగా ఎంపిక చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు.

ఈ నెలాఖరులోపు టీడీపీ అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచించారని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాన, రిపోర్టుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాను అని చంద్రబాబు చెప్పడం ఒకరకంగా టీడీపీ అభ్యర్థుల్లో టెన్షన్ రేపిందని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు ఏ విధంగా ముందుకెళ్లనున్నారు? ప్రజల అభిప్రాయాన్ని ఎలా సేకరిస్తారు? అన్నది టీడీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది.