YS Jagan: బర్రెలక్కకి వచ్చిన ఓట్లు కూడా ప్యాకేజీ స్టార్‌కి రాలేదు: జగన్
హైదరాబాద్‌లో ఉంటున్న కొందరు ఏపీ గురించి మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. నాన్ లోకల్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారని..

AP CM Jagan
Barrelakka: తెలంగాణలో బర్రెలక్కకి వచ్చిన ఓట్లు కూడా ప్యాకేజీ స్టార్‌కి రాలేదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని చెప్పారు. పవన్ కల్యాణ్‌కి సొంత నియోజక వర్గం అనేది కూడా లేదని జగన్ అన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో జగన్ మాట్లాడుతూ… ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానంటూ పవన్ కల్యాణ్ డైలాగులు కొడుతున్నారని జగన్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి కనీసం ఉద్ధానం ప్రాంతానికి మంచి నీరు ఇద్దామనే ఆలోచన కూడా రాలేదని జగన్ విమర్శించారు. ఉత్తరాంధ్రలో ఏ అభివృద్ధి జరిగినా.. చంద్రబాబు, పవన్‌కు నచ్చదని చెప్పారు.
హైదరాబాదులో ఉంటున్న కొందరు ఏపీ గురించి మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. నాన్ లోకల్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. ఉద్ధానంలో కిడ్నీ సమస్య చంద్రబాబు హయాంలోనూ ఉండేదని, ఆ సమస్యకు పరిష్కారం చూపలేదని అన్నారు.
ఇప్పుడు తమ ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపుతోందని జగన్ చెప్పారు. పేదవారి బతుకులు ఎలా మర్చాలనే ఆలోచన తనకు మాత్రమే ఉందని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడికి పేదల ప్రాణాలంటే లేక్కేలేదని చెప్పారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా నీళ్లు ఇవ్వలేక పోయారని జగన్ విమర్శించారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు పొత్తులు, దత్త పుత్రుడి మీద ఆదారపడతారని జగన్ అన్నారు. తాము ప్రజలకు మంచి చేసి, గొప్ప పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు కొందరు ఏడుస్తున్నారని చెప్పారు.