CM Revanth Reddy : గొప్ప వ్యక్తి స్పీకర్ కావటం ఆనందంగా ఉంది.. సహకరించిన అందరికి ధన్యవాదాలు : సీఎం రేవంత్ రెడ్డి
స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్,ఎంఐఎం,సీపీఐ, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని..భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

CM Revanth reddy (1)
CM Revanth Reddy..Speaker Gaddam Prasad Kumar : స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం హోదాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతు..స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్,ఎంఐఎం,సీపీఐ, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని..భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.గడ్డం ప్రసాద్ నా సొంత జిల్లా నేత అని తెలిపారు. వికారాబాద్ కు ఎంతో విశిష్టత ఉందని..వికారాబాద్ గుట్ట వైద్యానికి పెట్టింది పేరు అని అన్నారు.సమాజంలో ఎన్నో రుగ్మతలకు గడ్డం ప్రసాద్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నానని అన్నారు.గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారు..కింది స్థాయి నుండి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎదిగారని..వికారాబాద్ అభివృద్ధిలో గడ్డం ప్రసాద్‌ది చెరగని ముద్ర అని అన్నారు.
స్పీకర్ ప్రసాద్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు.అనంతరం మాట్లాడుతు..పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రసాద్ కుమార్ అని తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలను పెద్ద ఎత్తున చర్చించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు.శాసనసభ లో చర్చలు అర్థవంతంగా నడుపుతారని విశ్వసిస్తున్నానని అన్నారు.
ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అంతకు ముందు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ను ప్రకటించారు. తరువాత సభ్యులు అందరు కొత్త స్పీకర్‌కు అభినందనలు తెలిపారు.