Chandrababu Open Challenge To CM Jagan
Chandrababu Naidu : ఏపీలో రాజకీయం అంతకంతకూ వేడెక్కిపోతోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు సవాళ్ల పర్వం తారస్థాయికి చేరింది. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు నాయకులు. తాజాగా సీఎం జగన్ కు ఓపెన్ చాలెంజ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నీకు దమ్ముంటే.. నాతో బహిరంగ చర్చకు రా.. అంటూ సీఎం జగన్ ను చాలెంజ్ చేశారు చంద్రబాబు.
”దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా? ఎవరి పాలన స్వర్ణయుగమో? ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం. చర్చకు వచ్చే దమ్ముందా జగన్? బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో చర్చకు నేను సిద్ధం. సిద్ధం అని సభలు పెట్టి.. జగన్ అశుద్దం మాటలు చెబుతున్నారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్‍కు రాజకీయంగా చివరి ఛాన్స్.
Also Read : ప్రకాశంలో ఎవరిది ఆధిపత్యం? పార్టీల ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసా?
వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడత పెట్టారు. మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్.. సంక్షేమం గురించి చెప్పడమా? ఏ ఊరికెళ్లినా నీ ఐదేళ్ల పాలనలో విధ్వంసం కనిపిస్తోంది” అంటూ విరుచుకుపడ్డారు సీఎం జగన్.
Also Read : టీడీపీ కీలక నేత పల్లె రఘునాథరెడ్డికి షాక్ తప్పదా? ఆసక్తికరంగా పుట్టపర్తి టికెట్ ఫైట్