×
Ad

టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక.. ఏ క్షణమైనా ప్రకటన..!? లీకులు ఏం చెబుతున్నాయంటే?

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ బిజీగా ఉండటంతో జిల్లా కమిటీల ఎంపిక ఆలస్యమవుతూ వచ్చింది.

Chandrababu Naidu

TDP District Presidents: ఏపీ సీఎం, టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఎలక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. పవర్‌లోకి వచ్చి ఆల్రెడీ 18నెలలు అవుతుంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైమ్ ఉంది. ఇప్పటినుంచే పార్టీని లైన్‌లో పెట్టే ప్రయత్నంలో సీఎం చంద్రబాబు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల నియామకం ఆలస్యం అవడంపై ఆరా తీసిన టీడీపీ అధినేత..స్వయంగా తానే త్రీమెన్ కమిటీల రిపోర్టులను పరిశీలించి..సర్వే రిపోర్టుల ఆధారంగా ఓ అంచనాకు వచ్చారట.

ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ఆల్‌ మోస్ట్‌ కంప్లీట్ అయిందని ..ఒకటి రెండు రోజుల్లో అనౌన్స్‌మెంట్‌ కూడా చేస్తారని అంటున్నారు. ఈ నెల 17న జిల్లా కమిటీలను ప్రకటించేందుకు టీడీపీ అధిష్టానం పూర్తిస్థాయిలో కసరత్తు చేసి పెట్టిందని చెబుతున్నారు. జిల్లా కమిటీల ఎంపికలో క్యాస్ట్ ఈక్వేషన్స్‌కు ప్రయారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా పార్టీ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేశారు. 2024 ఎన్నికల్లో సోషల్ రీఇంజనీరింగ్‌తో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసి బెటర్ రిజల్ట్స్‌ను సాధించారు. ఇప్పుడు పార్టీ పదవుల పంపిణీ, జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారట. జనాభా ప్రాతిపదికతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఐదు అంశాలను బేస్ చేసుకుని జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారట.

Video: సిడ్నీ కాల్పుల ఘటన: ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కుని.. టూరిస్టుల ప్రాణాలు కాపాడిన ఈ వీరుడు ఎవరు?

త్రీమెన్ కమిటీ ప్రతి జిల్లాకు వెళ్లి..జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆ రిపోర్టును టీడీపీ అధిష్టానం ముందుంచింది. అయితే తీవ్ర ఒత్తిడి ఉండటంతో పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై ఓ నిర్ణయానికి రాలేకపోయింది. నాలుగైదు రోజుల క్రితం సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ ఆఫీస్‌కు వచ్చి..పార్టీ పదవుల పంపకం పెండింగ్‌లో పెట్టడంపై ఆరా తీశారు. ప్రతి జిల్లా నుంచి అధ్యక్షుడి ఎంపిక కోసం రెండు, మూడు పేర్లను ప్రతిపాదిస్తూ వచ్చిన నివేదికలను పరిశీలించి..జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర కమిటీ ఎంపికపై ఓ అంచనాకు వచ్చారట.

ఇప్పటికే డిస్ట్రిక్ ప్రెసిడెంట్‌ల సెలక్షన్‌ పూర్తి అయిందని..ఈ నెల 17న ప్రకటన ఉంటుందని అంటున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు పార్టీ కమిటీల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయిందని చెబుతున్నారు. పార్టీ బ్యాక్ ఆఫీస్, త్రీమెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా 34 శాతం పదవులు అగ్రవర్ణాలకు, 41 శాతం బీసీలకు, 7 శాతం పదవులను ఎస్సీలకు, 3 శాతం పదవులు ఎస్టీలకు మిగిలిన పదవులు మైనార్టీలతో పాటు ఇతర వర్గాలకు ఇవ్వాలని డిసైడ్ చేశారట.

పార్టీ పదవుల్లో మహిళలకు 33 శాతం కేటాయించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించిందట. ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, ఇతర అంశాల ఆధారంగా కనీసం 26 శాతం, పదవులు మహిళలకు దక్కేలా చూడాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. నేడో, రేపో తుది జాబితా, సామాజికవర్గాలకు అనుగుణంగా పదవులు, కసరత్తును పూర్తి చేయనుంది త్రీమెన్ కమిటీ. జిల్లా కమిటీల నియామకంలో టీడీపీ అధిష్టానం కొన్ని మార్పులు, చేర్పులు చేస్తోంది. గతంలో 32 మంది సభ్యులకు జిల్లా కమిటీల్లో అవకాశం కల్పించగా, ఇప్పుడు ఆ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయం తీసుకుంది. 32 నుంచి 40 మంది సభ్యులకు పెంచబోతున్నారట.

జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు ఐదుగురు కార్యదర్శులు, ఐదుగురు ఉపాధ్యక్షులతో పాటు కమిటీ సభ్యులను నియమిస్తారు. ఈ కమిటీల్లో యువనేతలతో పాటు సామాన్య కార్యకర్తలకు పదవులు దక్కేలా అధిష్టానం చర్యలు తీసుకుంటుందట. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు రానివారు, నామినేటెడ్ పదవులు దక్కని నేతలు..అధ్యక్ష పదవి కోసం ఆఖరి క్షణం వరకు లాబీయింగ్ చేస్తున్నారట.

అయితే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ బిజీగా ఉండటంతో జిల్లా కమిటీల ఎంపిక ఆలస్యమవుతూ వచ్చింది. గతవారం త్రిసభ్య కమిటీలతో చంద్రబాబు సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు, చేర్పులు సూచించగా..వాటిపై మరోసారి త్రీమెన్ కమిటీస్‌తో చంద్రబాబు సమావేశం డిస్కస్ చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు, కమిటీలు నియామకంపై అధికారంగా ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది.