Nara Lokesh : నవంబర్ 1 ఉమ్మడి మేనిఫెస్టో, టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరతాం- పవన్‌తో భేటీ తర్వాత లోకేశ్ కీలక వ్యాఖ్యలు

వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్తోంది. ఎవరు మాట్లాడితే వారిని ఈ ప్రభుత్వం హింసిస్తోంది. Nara Lokesh

Nara Lokesh On CM Jagan

Nara Lokesh On CM Jagan : రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా ఆరు అంశాలపై మూడు గంటల పాటు చర్చించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణ సహా పలు అంశాలపై ఇరు పార్టీల మధ్య సమాలోచనలు జరిగాయి. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు నారా లోకేశ్.

Also Read : మేము అధికారంలోకి రాగానే దీనిపైనే తొలి విచారణ జరిపిస్తాం: పవన్ కల్యాణ్

”టీడీపీ-జనసేన కలయిక ఏపీకి మేలు చేస్తుంది. రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం చేతిగానితనంతో సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయి. వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్తోంది. ఎవరు మాట్లాడితే వారిని ఈ ప్రభుత్వం హింసిస్తోంది.

Also Read : అంతిమ విజయం న్యాయానిదే, త్వరలోనే బయటకు వస్తా, నియంత పాల‌న‌పై పోరాటం కొన‌సాగించండి- తెలుగు ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టారు. ప్రతిపక్ష నేతల గొంతులు నొక్కుతున్నారు. రాబోయే 100 రోజుల కార్యాచరణపై చర్చించాం. 3 రోజుల పాటు ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం. టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం” అని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ కామెంట్స్..
”చంద్రబాబుకు మేమందరం ఉన్నాము అనే ఉద్దేశ్యంతో జైలుకి కూతవేటు దూరంలో ఈ సమావేశం పెట్టాం. జనసేన-టీడీపీ నాయకులు ఎలా కలిసి వెళ్ళాలి? అనే విషయంపై చర్చించాము. ప్రభుత్వం ఏర్పాటు చేశాక మరోసారి రాజమండ్రిలో సమావేశం పెట్టాలని ఆశిస్తున్నా”.

నారా లోకేశ్ కామెంట్స్..
” విజయదశమి రోజున ఈ కలయిన రాష్ట్రానికి మేలు చేసే కలయిక. జగన్ పాలనలో అన్ని కులాల వారిపై దాడులు జరుగుతున్నాయి. బీసీలకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. 34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రభుత్వ తన చేతకానితనంతో తాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేసింది”.

Also Read : వైసీపీ తెగులుకు జనసేన-టీడీపీ వాక్సినే సరైందన్న పవన్ కల్యాణ్.. ఎన్డీయేతో దోస్తీపై హాట్ కామెంట్స్